BigTV English

NTR: ఎన్టీఆర్‌తో జతకట్టేదెవరు.. ప్రశాంత్ నీల్ లేక త్రివిక్రమా..?

NTR: ఎన్టీఆర్‌తో జతకట్టేదెవరు.. ప్రశాంత్ నీల్ లేక త్రివిక్రమా..?

NTR: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల చేతుల్లో దాదాపు రెండు మూడేసి సినిమాలు ఉన్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు.. ఇలా ప్రతి స్టార్ హీరో వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే డైరెక్టర్లు కూడా ఒక సినిమా తర్వాత.. మరో సినిమా పట్టాలెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఒక స్టార్ హీరోతో చేయాల్సిన డైరెక్టర్ డేట్లు కుదరక మరొక హీరోతో చేయాల్సి వస్తుంది. అలాంటి చిక్కే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ఎదురైంది. అదేంటంటే..


త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అతడు అల్లు అర్జున్‌తో నాలుగో సినిమా చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ మూవీతో బిజీగా ఉన్నాడు. అందువల్ల ఈలోపు ఎన్టీఆర్‌తో ఓ సినిమా అనౌన్స్ చేద్దామని చూస్తున్నట్లు తాజా సమాచారం అందింది. అయితే ఎన్టీఆర్ కూడా ‘దేవర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే చివరి దశకు చేరుకుంది. అయినా.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి ముందే ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వార్తలు అప్పట్లో జోరుగా సాగాయి.

ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి.. తన తర్వాత ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ ముందు ప్రభాస్‌తో సలార్2 మూవీ మొదలు పెడతాడా? లేక ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడా అన్నది క్లారిటీ లేదు. ఒకవేళ సలార్ 2 మొదలు పెడితే.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే ఎన్టీఆర్‌తోనే ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అయితే త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేసే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×