BigTV English

Odela 2 Censor: ఓదెల 2 సెన్సార్ రిపోర్ట్.. మరీ ఇంత బూతా.. కట్ చేసి పడేసిన సెన్సార్.!

Odela 2 Censor: ఓదెల 2 సెన్సార్ రిపోర్ట్.. మరీ ఇంత బూతా.. కట్ చేసి పడేసిన సెన్సార్.!

Odela 2 Censor: తమన్నా భాటియా (Tamannaah Bhatia) .. మిల్కీ బ్యూటీగా తన అందచందాలతో ఆడియన్స్ ను అలరిస్తూ ఎంతోమంది హీరోల సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఎక్కువగా స్పెషల్ సాంగ్ లలో కూడా నటిస్తూ గ్లామర్ ఒలకబోసే ఈ అమ్మడు తొలిసారి సరికొత్త ప్రయోగం చేస్తూ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అదే ఓదెల 2. అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో సంపత్ నంది (Sampath Nandi) సారథ్యంలో ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇన్ని రోజులు గ్లామర్ ప్రదర్శిస్తూ.. కుర్రకారును దోచుకున్న తమన్నా.. తొలిసారి ఇందులో నాగసాధ్విగా శివశక్తి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల అవ్వగా.. ఈ ట్రైలర్లో తమన్నా తన నట విశ్వరూపాన్ని చూపించేసింది.


సెన్సార్ పూర్తి చేసుకున్న ఓదెల 2..

ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా రన్ టైం కూడా లాక్ అయ్యింది. పైగా సెన్సార్ సమయం లో సినిమా నుండి కొన్ని పదాలను మ్యూట్ చేయగా.. మరికొన్ని పదాలను సెన్సార్ మార్చమని సలహా ఇచ్చిందట. కంటెంట్ లో బూతులు ఎక్కువగా ఉండడంతో వాటిని కూడా కట్ చేసి పడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు కూడా వైరల్ గా మారింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘ ఏ’ సర్టిఫికెట్ జారీ చేయగా.. 2:29:50 నిడివితో సినిమా లాక్ చేయబడింది.


సెన్సార్ కట్..

సెన్సార్ కట్ చేసిన డైలాగ్స్ విషయానికి వస్తే.. సినిమా స్టార్ట్ అయిన 34.55 నిమిషాల వద్ద ఒక బూతు పదాన్ని కట్ చేశారు. అలాగే సినిమాలో అక్కడక్కడ మాట్లాడలేని బూతు పదాలు ఎక్కువగా ఉండడంతో వాటన్నింటిని డిలీట్ చేయించింది సెన్సార్ బోర్డు. ముఖ్యంగా బుతూ పదాలే కాదు కొన్ని చూడలేని సన్నివేశాలు, అత్యంత క్రూరంగా ఉండే సన్నివేశాలను కూడా తొలగించింది. ప్రత్యేకించి ఒక రే*ప్ సన్నివేశాన్ని కూడా తొలగించారు. మొత్తానికి అయితే 35 సెకండ్ల వీడియోని సినిమా నుండి తొలగించడం జరిగింది. సాధారణంగా ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేసినప్పుడే ఇది కేవలం పెద్దలు మాత్రమే చూసే సినిమా అని మనకు స్పష్టం అవుతుంది. ఇకపోతే ప్రేతాత్మ, అఘోరీ , శివశక్తి వంటి పాత్రలు ఎక్కువగా ఉండటం వల్లే పిల్లలు ఈ సినిమా చూడడానికి అర్హులు కాదు అని తేల్చేసింది సెన్సార్ బోర్డు. ఓదెల రైల్వే స్టేషన్ సినిమా సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, అజయ్ ఘోస్ తోపాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా ఎండింగ్లో హెబ్బా పటేల్ తన భర్త వశిష్ట ఎన్ సింహ తల నరికి.. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తుంది. ఇక అక్కడి నుంచి ఈ ఓదెలా 2 ప్రారంభం కాబోతోందని ట్రైలర్ లో రివీల్ చేసిన విషయం తెలిసిందే.

Ilaiyaraaja : తలాకు షాక్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాస్ట్రో… 5 కోట్లు కట్టాల్సిందే అంటూ నోటీసులు..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×