Special Education Teacher Posts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను చంద్రబాబు సర్కార్ మంజూరు చేసింది. ఇందులో 1136 ఎస్జీటీ, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం వేరువేరుగా రెండు ఉత్తర్వులను ఇచ్చింది.
ఉమ్మడి జిల్లాల వారీగా మంజూరు అయిన పోస్టుల వివరాలు
అనంతపురం: 101 ఎస్టీజీ పోస్టులు, 100 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
చిత్తూరు: 117 ఎస్జీటీ పోస్టులు, 82 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
తూర్పు గోదావరి: 127 ఎస్జీటీ పోస్టులు, 151 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
గుంటూరు: 151 ఎస్జీటీ పోస్టులు, 98 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
వైఎస్సార్ కడప: 57 ఎస్జీటీ పోస్టులు, 49 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
కృష్ణా: 71 ఎస్జీటీ పోస్టులు, 89 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
కర్నూల్: 110 ఎస్జీటీ పోస్టులు, 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
నెల్లూరు: 63 ఎస్జీటీ పోస్టులు, 44 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
ప్రకాశం: 74 ఎస్జీటీ పోస్టులు, 50 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
శ్రీకాకుళం: 71 ఎస్జీటీ పోస్టులు, 109 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
విశాఖపట్నం: 59 ఎస్జీటీ పోస్టులు, 52 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
విజయనగరం: 45 ఎస్జీటీ పోస్టులు, 66 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
పశ్చిమ గోదావరి: 30 ఎస్జీటీ పోస్టులు, 105 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు