Ilaiyaraaja :ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకులు, మ్యూజిక్ మాస్ట్రో గా పేరు సొంతం చేసుకున్న ఇళయరాజా (Ilaiyaraaja).. తాజాగా తలా అజిత్ (Ajith) కి లీగల్ నోటీసులు పంపించారు. ముఖ్యంగా రూ.5కోట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు పంపడానికి గల కారణం ఏమిటంటే… తాజాగా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో తన పర్మిషన్ లేకుండా తన పాటను ఉపయోగించినందుకు గానూ రూ.5 కోట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ నోటీసులు పంపించారు ఇళయరాజా. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అసలేమైందంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ తమిళ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీతో తొలిసారి తమిళ్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని, రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో.. ఒకప్పటి తమిళ సినిమాలలో ఇళయరాజా సంగీతం అందించిన పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీలో రీమిక్స్ చేసి ఉపయోగించారు. ఆ సదరు సీన్స్ మ్యూజిక్ ను థియేటర్స్ లో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవ్వడంతో.. ఇది కాస్త ఇళయరాజా వరకు చేరింది. దీంతో షాక్ అయిన ఇళయరాజా..తన పాటను అనధికారికంగా వాడుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నష్టపరిహారం కింద తనకు 5 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ అజిత్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ కు నోటీసులు పంపించారు.
చిత్ర బృందం క్షమాపణ చెప్పాలి..
రూ.5 కోట్ల నష్టపరిహారంతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలోని మూడు పాటలను వెంటనే నిలిపివేయాలని తన నోటీసుల్లో కోరారు. అంతేకాదు 7 రోజుల్లోగా చిత్రబృందం బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.. మరి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అలాగే స్టార్ హీరో అజిత్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే ఇళయరాజా ఇలా నోటీసులు పంపించడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలో కూడా కొన్ని సినిమాలలో తన పర్మిషన్ లేకుండా పాటలు ఉపయోగించారు అంటూ పలు సంస్థలకు ఇలాగే నష్టపరిహారం కోసం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Tollywood: 300 పెళ్లి చూపులు..ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి.. వరుడు ఎవరంటే..?