BigTV English

Varun Dhawan: సమంతతో నటించొద్దని వార్నింగ్ ఇచ్చారు.. వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్

Varun Dhawan: సమంతతో నటించొద్దని వార్నింగ్ ఇచ్చారు.. వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్

Varun Dhawan: సీనియర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఒకప్పటిలాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం లేదు. అలాంటిది చాలాకాలం తర్వాత ఒక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్. అంతే కాకుండా ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా యాక్టివ్ అయ్యింది. ఆ సిరీసే ‘సిటాడెల్ హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించగా వరుణ్ ధావన్‌తో జోడీ కట్టింది సమంత. తాజాగా ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న వరుణ్.. సమంత గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. కొందరు తన దగ్గరకు వచ్చి సమంతతో నటించొద్దని చెప్పారని బయటపెట్టాడు.


ట్రైలర్ ఈవెంట్‌లో

ఇప్పటివరకు సమంత.. హిందీలో సినిమాలు చేయకపోయినా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే సిరీస్‌తో మొదటిసారి నేరుగా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. అది సినిమా కాకపోయినా వెబ్ సిరీసే అయినా బాలీవుడ్‌లో దానివల్ల సమంతకు భారీగానే పాపులారిటీ లభించింది. ఇప్పుడు ‘సిటాడెల్ హనీ బన్నీ’తో మరోసారి బీ టౌన్‌ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధపడింది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ బయటికొచ్చింది. ట్రైలర్ లాంచ్‌లో సమంత (Samantha), వరుణ్ ధావన్ (Varun Dhawan) కలిసి పాల్గొన్నారు. ఆ సిరీస్‌కు సంబంధించిన విశేషాలతో పాటు సమంతపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు వరుణ్.


Also Read: మరొక్క ఛాన్స్… టాలీవుడ్ వైపు బాలయ్య హిందీ హీరోయిన్ చూపు

హిందీ హీరోయిన్లను చూసుకో

‘‘సమంతను ఫీమేల్ లీడ్‌గా తీసుకోవద్దని నాకు చాలామంది వార్నింగ్ ఇచ్చారు. బాలీవుడ్‌లో పెద్దలే అలా చేశారు. సమంతతో యాక్ట్ చేయొద్దు, హిందీ హీరోయిన్లను ఎంపిక చేసుకో అన్నారు. కానీ నాతో పాటు దర్శకులు కూడా సమంతనే కావాలని కోరుకున్నాం. తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ కచ్చితంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అని బయటపెట్టాడు వరుణ్ ధావన్. అయితే సమంతకు బాలీవుడ్ బడా మేకర్స్‌తో కూడా మంచి సాన్నిహిత్యం ఉన్నా.. వారంతా వరుణ్‌తో ఎందుకలా చెప్పారు అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక ‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్ చూసిన తర్వాత సమంతలాగా మరే ఇతర బాలీవుడ్ హీరోయిన్ కూడా యాక్షన్ స్టంట్స్ చేయలేదని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

వద్దని బ్రతిమిలాడాను

‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. సమంత మయాసైటీస్‌తో బాధపడుతుందని తెలిసిన తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలను పక్కన పెట్టేసి ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంది. కానీ అదే సమయంలో తనకు ‘సిటాడెల్’ ఆఫర్ వచ్చింది. అయితే తాను ఈ సిరీస్ చేయను అని డైరెక్టర్స్‌ను బ్రతిమిలాడుకున్నా కూడా వారు వినలేదని చెప్పుకొచ్చింది. వేరే హీరోయిన్లను చూసుకోమని చెప్పిందని, తాను ఉన్న పరిస్థితుల్లో ఆ యాక్షన్ సీన్స్ చేయలేనని చెప్పినా వారు వినలేదని గుర్తుచేసుకుంది సమంత. ఇదంతా విన్న తర్వాత సమంత ఈ సిరీస్‌లో యాక్ట్ చేయడం మంచిదయ్యింది అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×