Prabhas : బర్త్ డే బాయ్ ప్రభాస్ కు ఓర్మాక్స్ గిఫ్ట్.. ఆనందంలో అభిమానులు..

Prabhas : బర్త్ డే బాయ్ ప్రభాస్ కు ఓర్మాక్స్ గిఫ్ట్.. ఆనందంలో అభిమానులు..

Prabhas
Share this post with your friends

Prabhas

Prabhas : టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా నటించే అందరూ హీరోలే కానీ.. వరల్డ్ వైడ్ వాళ్లకి ఎటువంటి పాపులారిటీ ఉంది అనే విషయం దగ్గరకి వస్తే మాత్రం చాలా తేడాలు కనిపిస్తాయి. పాపులర్ ఓర్మాక్స్ సర్వే 2023 విడుదల చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఈరోజు బర్త్ డే బాయ్ ప్రభాస్ టాప్ 5 పొజిషన్స్ లో ఉన్నాడు. ఇక మొదటి పది స్థానాలలో బన్నీ, ఎన్టీఆర్ , మహేష్ ఉండటం విశేషం. ఈ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ నటుడిగా కింగ్ ఆఫ్ రొమాన్స్.. బాలీవుడ్ బాద్‍షా షారుక్ ఖాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఆ తరువాత ప్రభాస్ ఎవరు ఊహించని విధంగా మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

తాజా సర్వే నివేదిక ప్రకారం బాలీవుడ్ నుంచి షారుక్, తమిళ్ ఇండస్ట్రీ నుంచి విజయ్ , టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఈ సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. డార్లింగ్ ప్రభాస్ కు ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అన్న విషయం మరొకసారి ఈ రిపోర్టుతో రుజువైంది. దశాబ్దాలుగా బాలీవుడ్ లోనే కాదు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమను తన గుప్పెటలో పెట్టుకున్న కింగ్ ఖాన్ కు ధీటుగా ప్రభాస్ ఈ రోజు తన స్టార్ డమ్ పెంచుకోగలిగాడు.

ఈ సర్వే రిపోర్ట్ ఒకటి చాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ చరిష్మా ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. నాలుగో స్థానం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, ఐదో స్థానం సల్మాన్ ఖాన్ దక్కించుకున్నారు. తమిళ్ హీరో అజిత్ కుమార్ ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. ఏడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఎనిమిదో స్థానంలో బన్నీ ఉండగా తొమ్మిదో స్థానం తమిళ్ స్టార్ హీరో సూర్య దక్కించుకున్నాడు. మహేష్ బాబు పదో స్థానంలో ఫిక్స్ అయిపోయాడు.

మామూలుగా బాలీవుడ్ హవా కనిపించే ఇలాంటి సర్వేలలో కూడా క్రమంగా టాలీవుడ్ తన కౌంటును పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో తన కంటే ఎంతో అనుభవం ,ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ దిగ్గజ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళని కూడా వెనక్కి నెట్టి ప్రభాస్ ముందుకు దూసుకుపోవడం నిజంగా టాలీవుడ్ గర్వించదగ్గ విషయం. ఈ ఓర్మాక్స్ సర్వే ఫలితాలను తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. డార్లింగ్ బర్త్ డే కి మంచి గిఫ్ట్ ముందుగానే అందింది అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ను మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సలార్ చిత్రం నవంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆ తర్వాత భారీ అంచనాల మధ్య కల్కి రంగంలోకి దిగుతుంది. ఈరోజు తమ అభిమాన స్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ గ్రాండ్ గా అతని బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Karnataka : ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. సీఎం ఎంపిక బాధ్యత ఖర్గేకే .. సీఎల్పీ తీర్మానం..

Bigtv Digital

Corona Virus : చైనాలో కరోనా డేంజర్ బెల్స్..భారత్ అలెర్ట్..

BigTv Desk

Danger Snails : ఉయ్యూరు విశ్వశాంతిలో విదేశీ దందా.. అవాక్కైన అధికారులు

Bigtv Digital

Avatar 2 Twitter Review : విజువల్ వండర్ “అవతార్ 2 : ద వే ఆఫ్ వాటర్”

BigTv Desk

Pooja Hegde:- డేటింగ్ వార్తలపై పూజా హెగ్డే క్లారిటీ

Bigtv Digital

Glenn Maxwell : మాక్స్‌వెల్ వీరోచితం.. ఒంటి కాలితో ఊచకోత..

Bigtv Digital

Leave a Comment