2025 Oscar Nominations : ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సినీ వేడుక ‘ఆస్కార్స్’ (OSCAR). ఇక ఈ వేడుక ప్రతీ ఏడాదిలాగే ఎంతో ఘనంగా జరగబోతోంది. ఇందుకు సర్వం సిద్ధం చేస్తుంది ఆస్కార్ అకాడమి. ఈ నేపథ్యంలో అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ప్రకటించింది.
ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో వ్యాపించిన కార్చిచ్చు కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడిన ఈ కార్యక్రమంను ఎట్టకేలకు గురువారం అకాడమి ప్రకటించింది. 97వ అకాడమీ అవార్డుల (97 Academy Awards) కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ప్రకటించింది.
ఆస్కార్ నామినేషన్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటిన ‘ది బ్రూటలిస్ట్’ (The Brutalist), ‘ఎమిలియా పెరెజ్’ (Emilia Pérez) చిత్రాలు ఎక్కువ కేటగిరీల్లో పోటీ పడుతున్నాయి. కాన్‌క్లేవ్ (Conclave), అనోరా (Anora), ది సబ్‌స్టాన్స్ (The Substance), ది రియల్ పెయిన్ (A Real Pain), విక్డ్ (Wicked), ఎ కంప్లీట్ అన్‌నోన్ (a complete unknown), డ్యూన్ : పార్ట్2 (Dune : Part 2) చిత్రాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనోజా’ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్ కేటగిరిలో పోటీ పడుతుంది. ప్రియాంక చోప్రా జోన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు ఆడమ్ జె.గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చి 2న ఎంతో ఘనంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
ఉత్తమ చిత్రం –
అనోరా
ది బ్రూటలిస్ట్
కాన్‌క్లేవ్
డ్యూన్: పార్ట్2
ఎమిలియా పెరెజ్
విక్డ్
ఎ కంప్లీట్ అన్‌నోన్
ఐయామ్ స్టిల్ హియర్
నికెల్ బాయ్స్
ది సబ్‌స్టాన్స్
ఉత్తమ దర్శకుడు –
సీన్ బేకర్ (అనోరా)
బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్)
జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్)
కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)
జేమ్స్ మ్యాన్‌గోల్డ్ (ది కంప్లీట్ అన్‌నోన్)
ఉత్తమ నటుడు –
అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్‌నోన్)
రే ఫియన్నెస్ (కాన్‌క్లేవ్)
సెబస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)
కోల్‌మెన్ డొమినింగో (సింగ్‌సింగ్)
ఉత్తమ నటి –
సింథియా ఎరివో (విక్డ్)
కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్)
ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)
మికే మాడిసన్ (అనోరా)
డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)
ఉత్తమ సహాయ నటుడు –
యురా బోరిసోవ్ (అనోరా)
జెరీమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్)
కిరెన్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఎడ్వర్డ్ నార్తన్ (ది కంప్లీట్ అన్‌నోన్)
గాయ్ పియర్స్ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ సహాయ నటి –
మోనికా బార్బరో (ది కంప్లీట్ అన్‌నోన్)
అరియానా గ్రాండే (విక్డ్)
జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్)
ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్‌క్లేవ్)
ALSO READ : ‘గాంధీ తాత చెట్టు’పై మహేశ్ బాబు రివ్యూ.. ప్రేక్షకులకు హీరో ఇచ్చే సూచన ఇదే.!