Gandhi Thatha Chettu: ఈరోజుల్లో చాలామంది దర్శక నిర్మాతల వారసులు కూడా తెరపై కనిపించాలనే కలలు కంటున్నారు. హీరోహీరోయిన్లుగానే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. హీరోహీరోయిన్లుగా మాత్రమే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న వారసులు ఉన్నారు. అందులో ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ వారసురాలు కూడా యాడ్ అయ్యింది. ‘గాంధీ తాత చెట్టు’ అని ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను పలకరించనుంది సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi). ఇక సినీ పరిశ్రమ నుండి ఈ సినిమాను చూసి రివ్యూ చేసిన మొదటి సెలబ్రిటీగా మహేశ్ బాబు నిలిచారు.
మహేశ్ బాబు మొదటి రివ్యూ
‘గాంధీ తాత చెట్టు’ సినిమాను చూసిన మహేశ్ బాబు.. దీనిపై తన రివ్యూ అందించారు. మామూలుగా చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దానిని చూసి రివ్యూ అందించడంలో మహేశ్ బాబు ముందుంటారనే విషయం అందరికీ తెలుసు. అదే విధంగా ‘గాంధీ తాత చెట్టు’ను కూడా చూసి దానిపై తన అభిప్రాయాన్ని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాను అందరూ చూడాలని సూచించారు. మహేశ్ ఇచ్చిన రివ్యూకు హ్యాపీ అయిన మేకర్స్.. ఈ ట్వీట్‌ను చూపిస్తూ థాంక్యూ అంటూ ఫోటోను షేర్ చేశారు. దీంతో తన ఫ్యాన్స్ అంతా మహేశ్ రివ్యూ ఇచ్చారంటే సినిమా కచ్చితంగా బాగుంటుందని ఫిక్స్ అయిపోతున్నారు.
చాలా గర్వపడుతున్నాను
‘గాంధీ తాత చెట్టు (Gandhi Thatha Chettu).. ఈ సినిమా మీతో అలా ఉండిపోతుంది. అహింసపై ఒక అందమైన కథకు పద్మ మల్లాడి ప్రాణం పోశారు. నా లిటిల్ ఫ్రెండ్ సుకృతి వేణి బండ్రెడ్డిని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నిన్ను ఇలా నటిగా ఎదగడం, ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంకా నీ ప్రయాణం చాలా కొనసాగాలని కోరుకుంటున్నా. ఈ మాస్టర్‌పీస్‌ను అందరూ వెళ్లి చూడండి’ అంటూ తనకు ఈ సినిమా నచ్చిందని చెప్పడంతో పాటు ప్రేక్షకులను కూడా వెళ్లి చూడమని కోరారు మహేశ్ బాబు (Mahesh Babu). ఈ మూవీ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.
Also Read: సిద్ధు జొన్నలగడ్డపై మనసు పారేసుకున్న ‘బేబి’ బ్యూటీ.. పోస్ట్ వైరల్..
దానివల్లే హైప్
సుకుమార్ (Sukumar) కూతురు నటించిన ఈ సినిమాను తనే భార్య నిర్మించింది. ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తను దర్శకత్వం వహించిన ‘పుష్ప 2’ విడుదలయ్యి రెండు నెలలు కూడా కాలేదు. అదే సమయంలో తన కూతురు డెబ్యూ మూవీ అయిన ‘గాంధీ తాత చెట్టు’ విడుదల కావడం అనేది ఈ సినిమాకు స్పెషల్ హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ఇప్పటికే సుకుమార్ పేరు చెప్పగానే ‘పుష్ప’ సినిమానే గుర్తుచేసుకుంటున్నారు ప్రేక్షకులు. అదే ఇప్పుడు ‘గాంధీ తాత చెట్టు’ ప్రమోషన్స్‌కు చాలా ప్లస్ అయ్యింది. చాలామంది ఆడియన్స్ ఈ మూవీని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
#GandhiThathaChettu… This film will stay with you. ❤️ A poignant story about ahimsa beautifully brought to life by @padmamalladi14.
So incredibly proud of you my little friend #SukritiVeniBandireddi.. watching you grow into this beautiful actress and deliver such a powerful…
— Mahesh Babu (@urstrulyMahesh) January 23, 2025