EPAPER

Vishwambhara movie: విశ్వంభర కు ఓటీటీ లో ఎదురుదెబ్బ.. అంత పెట్టలేమంటున్న సంస్థలు

Vishwambhara movie: విశ్వంభర కు ఓటీటీ లో ఎదురుదెబ్బ.. అంత పెట్టలేమంటున్న సంస్థలు

Ott problem for Megastar Chiranjeevi Vishwambhara movie: మెగాస్టార్ సినిమా అంటే అప్పట్లో విడుదలైన తొలి వారం రోజులు సినిమా టిక్కెట్లు బ్లాక్ లో అమ్మేవారు. చిరంజీవికి ఉండే క్రేజ్ అలాంటిది. చిరు ఫెయిల్యూర్ మూవీస్ కూడా మినిమం గ్యారెంటీ వసూళ్ల సాధించేవి. పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తన ఓన్ ట్యాలెంట్ తో మెగా సామ్రాజ్యం సృష్టించుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం తన ఫ్యామిలీ నుంచే ఓ అరడజను మంది హీరోలు ఇండస్ట్రీని శాసిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ తర్వాత చిరంజీవి నెంబర్ వన్ గా కొనసాగుతూ వస్తున్నారు. చాలా గ్యాప్ తీసుకుని 150 వ సినిమా నుంచి మళ్లీ రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి.


హైప్ తెచ్చిన విశ్వంభర

ఆ తర్వాత వచ్చిన సైరా, ఆచార్య, భోళా శంకరుడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా గత ఏడాది వచ్చిన వాల్తేర్ వీరయ్య మూవీ రూ.100 కోట్లు కొల్లగొట్టింది. రీసెంట్ గా బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి  చిరంజీవితో విశ్వంభర మూవీని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. టైటిల్ మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. 2025 సంక్రాంతికి రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. గత ఏడాది సంక్రాంతి సెంటిమెంట్ తోనే వాల్తేరు వీరయ్య హిట్ కొట్టారు చిరంజీవి. అందుకే విశ్వంభర మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ సోషియో ఫాంటసీ గా రూపొందుతోంది. అప్పట్లో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేక వీరుడు-అతిలోక సుందరి మూవీ ఎంత రేంజ్ హిట్టో తెలిసిందే..అయితే అప్పటినుంచి చిరంజీవి సోషియో ఫాంటసీ జోనర్ లో ఏ మూవీ కూడా చేయలేదు.


బింబిసారతో లింక్

మధ్యలో అంజి మూవీ వచ్చినా అది పూర్తి స్థాయిలో సోషియో ఫాంటసీ కాదు. అయితే ఈ విశ్వంభర మూవీ గురించి ఓ టాక్ నడుస్తోంది. అది కళ్యాణ రామ్ బింబిసార మూవీతో లింక్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఆ మూవీకి కనెక్షన్ పెట్టి విశ్వంభర మూవీని రూపొందిస్తున్నారట. అయితే దీనిని సినిమా టిక్ యూనివర్స్ అంటారు. ఈ మధ్య వస్తున్న తమిళ, హిందీ సినిమాలన్నీ ఈ సినిమాటిక్ యూనివర్స్ నే ఫాలోఅవుతున్నారు. ఇక ఈ విశ్వంభర మూవీకి భారీ బడ్జెట్ తో చిరు సినిమాలలోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. సినిమాకు వచ్చిన హైప్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే ఉన్నట్ల సమాచారం. అయితే ఈ మధ్య సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలకు అదే రేంజ్ ఓటీటీ రేట్లు వస్తున్నాయి.

ఓటీటీ సంస్థల వెనకడుగు

విడుదల కాకముందే ఫాన్సీ రేటుకు సినిమా పెట్టుబడిలో సగం మొత్తం ఓటీటీ ద్వారా నిర్మాతకు వచ్చేస్తోంది. అయితే విశ్వంభర నిర్మాతలు చెప్పిన ఫ్యాన్సీ రేటు ఇచ్చేందుకు ఓటీటీ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని సమాచారం. ఎందుకంటే గతంలో ఆచార్య, భోళా శంకర్ సినిమాలతో ఓటీటీలకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఆ ఎఫెక్టు విశ్వంభర పైనా పడింది. ప్రొడ్యూసర్స్ కోట్ చేసిన ఎమౌంట్ ను ఇచ్చేందుకు ఓటీటీ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయట. కేవలం అందులో సగం మాత్రమే ఇస్తామని అంటున్నాయి. ఇదంతా గత చిత్రాల ఫ్లాపుల ప్రభావమే అని స్పష్టమవుతోంది.

 

Related News

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Citadel Honey Bunny: తల్లి పాత్రలో సమంత.. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌పై కాంట్రవర్షియల్ డైలాగ్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Big Stories

×