BigTV English

Bigg Boss 8 Telugu: పృథ్వితో సోనియా పర్సనల్ ముచ్చట్లు.. మూడు నెలలు నన్ను ప్రేమించు అంటూ విష్ణుప్రియా డైరెక్ట్ ప్రపోజల్

Bigg Boss 8 Telugu: పృథ్వితో సోనియా పర్సనల్ ముచ్చట్లు.. మూడు నెలలు నన్ను ప్రేమించు అంటూ విష్ణుప్రియా డైరెక్ట్ ప్రపోజల్

Bigg Boss 8 Telugu Latest Updates: ప్రతీ సీజన్‌లో బిగ్ బాస్‌లో హైలెట్‌గా నిలిచే అంశం లవ్ స్టోరీస్. బయట అసలు ఎవరో కూడా తెలియని కొందరు వ్యక్తులు.. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే త్వరగా క్లోజ్ అయిపోతారు. అలా వారి క్లోజ్‌నెస్ పెరిగిపోతుంది. అది చూసి తోటి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా హౌజ్‌లో ఒక ప్రేమకథ మొదలయ్యిందని ఊహించడం మొదలుపెడతారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో కూడా అలాంటి ప్రేమకథ మొదలయినట్టే అనిపిస్తోంది. మొదట్లో ఎవరికి వారు అన్నట్టుగా ఉన్న సోనియా, నిఖిల్.. ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు. మధ్యలో పృథ్విరాజ్ కూడా రావడం వల్ల ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.


చేతులు పట్టుకొని ముచ్చట్లు

మామూలుగా నిఖిల్‌తోనే సోనియా ఎక్కువగా క్లోజ్‌గా ఉంటుంది. మిగతా కొందరు కంటెస్టెంట్స్‌తో కూడా తను గొడవపడకుండా బాగానే ఉంటుంది. కానీ నిఖిల్‌తోనే తన బాండింగ్ ఎక్కువగా ఉందని.. హౌజ్‌లో అందరు ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. అలాంటి సోనియా.. తాజాగా విడుదలయిన ఎపిసోడ్‌లో పృథ్విరాజ్‌తో కూర్చొని, తన చేయి పట్టుకొని, తన బాయ్‌ఫ్రెండ్‌కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘‘నన్ను అర్థం చేసుకోవాలి. ఓపిక ఉండాలి. ఆలోచించే విధానం కరెక్ట్‌గా ఉండాలి. ఎప్పుడూ ఎదగాలనే ఆలోచన ఉండాలి. తర్వాత ఏంటి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి. రిలాక్స్ అవ్వకూడదు’’ అంటూ తన లిస్ట్‌‌ను కంటిన్యూ చేసింది.


Also Read: దానివల్లే జీవితం తలకిందులు అయ్యింది.. అందరినీ అలా రెచ్చగొట్టింది, నా మాట రాసిపెట్టుకోండి: బేబక్క

పెద్ద లిస్టే ఉంది

‘‘అందరికీ మర్యాద ఇవ్వాలి. మంచి మనసు అయ్యిండాలి. మనం ఎంత ఎదిగినా ఫ్యామిలీని చూసుకోవాలి, బయటవాళ్లను చూసుకోవాలి అనే మనస్థత్వం ఉండాలి. నా ఆలోచనలను డిస్టర్బ్ చేయనివాడు కావాలి. నేనేం చేయాలనుకున్నా దానికి సపోర్ట్ చేసేలాగా ఉండాలి. పిచ్చి లేకపోయినా ఏం కాదు కానీ బుద్ది ముఖ్యం’’ అంటూ పెద్ద లిస్టే చెప్పింది సోనియా. అలా పృథ్వి, సోనియా చేతులు పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ అక్కడే ఉన్నా.. వారిని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. కానీ విష్ణుప్రియా మాత్రం మధ్యలో వచ్చి జోక్యం చేసుకుంది. ‘‘నిజమైన ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి’’ అంటూ డైలాగ్ కొట్టింది.

మాటిచ్చిన నిఖిల్

సోనియా, పృథ్విరాజ్ అలా చేతులు పట్టుకొని మాట్లాడడం వల్ల తను ఇన్‌డైరెక్ట్‌గా హర్ట్ అయ్యానని చెప్పింది. అంతే కాకుండా ఒకరు ఎంతమందిని అయినా ప్రేమించొచ్చు అంటూ చెప్పుకొచ్చింది. చివరిగా అక్కడి నుండి వెళ్లిపోతూ ‘‘ఈ మూడు నెలలు నన్ను ప్రేమించు’’ అని పృథ్విరాజ్‌ను డైరెక్ట్‌గా అడిగేసింది విష్ణుప్రియా. ఇదిలా ఉండగా.. సోనియా, నిఖిల్ మధ్య కూడా కొన్ని పర్సనల్ ముచ్చట్లు నడిచాయి. తనకు వాటర్ ఇవ్వమని నిఖిల్ అడగగానే ఏమీ మాట్లాడకుండా ఇచ్చేసింది సోనియా. ‘‘నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా ఇస్తా’’ అని ఆఫర్ కూడా ఇచ్చింది. అది విన్న నిఖిల్.. ‘‘బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లేలోపు మానేస్తా’’ అని మాటిచ్చాడు కూడా.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×