BigTV English

OTT: ఓటీటీలో ‘బలగం’.. ఎందులోనంటే?.. ఈవారం సినిమాలు, సిరీస్‌లు ఇవే..

OTT: ఓటీటీలో ‘బలగం’.. ఎందులోనంటే?.. ఈవారం సినిమాలు, సిరీస్‌లు ఇవే..
balagam

OTT: బలగం. ఇటీవల కాలంలో జనాన్ని బాగా టచ్ చేసిన సినిమా. కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్లకు వెళ్తున్నారు. బలగం చిత్రంతో తమ బలగాన్ని పోల్చుకుంటున్నారు. దాదాపు ప్రతీఒక్కరిని, సినిమాలోని ఏదో ఒక పాయింట్ టచ్ చేస్తోంది. అది తమ ఇంటి కథేనని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. బలగం.. అంతలా పబ్లిక్ టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే, అంతటి డ్రామాను చూట్టానికి కాస్త ఓపిక అవసరం అంటున్నారు. అలాంటి వారంతా బలగం ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా.. ఫ్యామిలీ అంతాకలిసి ఇంట్లోనే చూద్దామా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. బలగం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.


కామెడియన్ వేణు డైరెక్షన్‌లో వచ్చిన ఫీల్‌గుడ్‌ మూవీ బలగం(balagam). ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 3న థియేటర్లలో రిలీజ్ కాగా.. ప్రేక్షకులతో పాటు, విమర్శకులనూ మెప్పించింది. తెలంగాణ పల్లె జీవనాన్ని, మనుషుల మధ్య బంధాలను ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సింప్లీ సౌత్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై మార్చి 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బలగంతో పాటు అనేక సినిమాలు, సిరీస్‌లు ఈవారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. షారుఖ్‌ఖాన్, దీపిక పదుకొణె నటించిన సూపర్ హిట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ “పఠాన్” ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో హిందీ, తెలుగు, తమిళ్‌ భాషల్లో అందుబాటులో ఉంది. ఓటీటీ కోసం థియేటర్‌లో తొలగించిన కొన్ని సన్నివేశాలను జోడించారు. ఈ వీకెండ్‌లో ‘పఠాన్‌’దే జోష్ అంటున్నారు.


ఈ వారం ఓటీటీ రిలీజెస్…

అమెజాన్‌ప్రైమ్‌
పఠాన్‌ (హిందీ) మార్చి 22
హంటర్‌ (హిందీ) మార్చి 22
బలగం (తెలుగు) మార్చి 24
బకాసురన్‌ (తమిళం) మార్చి 24

నెట్‌ఫ్లిక్స్‌
వాకో (వెబ్‌సిరీస్‌)
ది నైట్‌ ఏజెంట్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 23
చోర్‌ నికల్‌ కె భాగా (హిందీ) మార్చి 24
హూ వర్‌ వుయ్‌ రన్నింగ్‌ ఫ్రమ్‌ (టర్కీస్ సిరీస్) మార్చి 24
హై అండ్‌ లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్ మూవీ) మార్చి 25
క్రైసిస్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 26

ఆహా..
డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) మార్చి 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
సక్సెసెన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) మార్చి 26

బుక్‌ మై షో
మ్యాక్స్‌ స్టీల్‌ (హాలీవుడ్) మార్చి 24
ఆన్‌ ది లైన్‌ (హాలీవుడ్‌) మార్చి 24

సోనీలివ్‌
పురుషప్రేతం (మలయాళం) మార్చి 24

జీ5
కంజూస్‌ మక్కీ చూస్‌ (హిందీ) మార్చి 24
పూవన్‌ (మలయాళం) మార్చి 24

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×