BigTV English

Cinemas: థియేటర్లలో, ఓటీటీలో ఈవారం వచ్చే సినిమాలివే..

Cinemas: థియేటర్లలో, ఓటీటీలో ఈవారం వచ్చే సినిమాలివే..

Cinemas: ప్రతివారంలానే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. అయితే ఈ వారం మాత్రం అన్ని చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటించిన ‘బలగం’, బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ నటించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’తో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.


ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు

సోహైల్, మృణాళిని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీ మార్చి 3న థియేటర్లలో సందడి చేయనుంది. కేవలం 44 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేశారు. కోనేరు కల్పన ఈ మూవీని నిర్మిస్తున్నారు.


బలగం

వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బలగం’. తెలంగాణ పల్లెటూరు నేపథ్యంతో సాగే కథతో వస్తోన్న ఈ మూవీ మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిచి గాడి పెళ్లి

చందన్‌రాజ్, సత్య ప్రధానపాత్రలో డైరెక్టర్ హేమరాజ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. మానవ సంబంధాల్ని ఆవిష్కరించే కథతో ఈ సినిమాన తీర్చిదిద్దారు. ఈ మూవీ కూడా మార్చి 3న రిలీజ్ కానుంది.

గ్రంథాలయం

సాయి శివన్ జంపన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్రంథాలయం’. విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి జంటగా నటించిన ఈ మూవీ మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాచి

సంజన రెడ్డి, గీతిర రధన్ ప్రధాన పాత్రలో వివేక్ పోతగోని తెరకెక్కిస్తున్న మూవీ ‘సాచి’. బిందు అనే యువతి నిజ జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మార్చి 3న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

థలైకూతల్‌ (తమిళం) మార్చి 3-నెట్‌ఫ్లిక్స్‌

హీట్‌వేవ్‌ (హాలీవుడ్‌) మార్చి 1-నెట్‌ఫ్లిక్స్‌

సెక్స్‌ లైఫ్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 2-నెట్‌ఫ్లిక్స్‌

డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 3-అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 3-జీ5

ఎలోన్‌ (మలయాళం/తెలుగు) మార్చి 3-డిస్నీ+హాట్‌స్టార్‌

ది మాండలోరియన్‌ (వెబ్‌సిరీస్‌-3) మార్చి 1-డిస్నీ+హాట్‌స్టార్‌

గుల్మొహర్‌ (హిందీ) మార్చి 3-డిస్నీ+హాట్‌స్టార్‌

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×