Movies: సినీ ప్రేక్షకులను అలరించేందుకు ఈవారం కూడా కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. అటు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు, వెబ్‌సిరీస్‌లో సిద్ధమవుతున్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో చూద్దాం..
థియేటర్‌లో రిలీజ్ అయ్యే చిత్రాలు…
వినరో భాగ్యము విష్ణు కథ:
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కశ్మీరా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 18న థియేటర్లలో సందడి చేయనుంది. డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
సార్:
వెంకీ అట్లూరి దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
షెహ్‌జాదా:
కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా రోహిత్ ధావన్ తెరకెక్కిస్తున్న మూవీ షెహ్‌జాద్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ అల వైకుంఠపురములో మూవీని హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లలో సందడి చేయనుంది.
ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు
మాలికాపురం:
ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాలికాపురం. థియేటర్‌లలో రిలీజ్ అయి సెక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 15 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
కళ్యాణం కమనీయం:
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కళ్యాణం కమనీయం’. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఫిబ్రవరి 17న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సందడి చేయనుంది.
నెట్‌ఫ్లిక్స్
రెడ్ రోజ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 15
పర్ఫెక్ట్ మ్యాచ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 14
ది రొమాంటిక్స్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 14
ఫుల్ స్వింగ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 15
సర్కస్ (హిందీ) ఫిబ్రవరి 17
గ్యాంగ్‌లాండ్స్ (వెబ్‌సిరిస్) ఫిబ్రవరి 17
స్క్వేర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 13
ఏ సండే ఎఫైర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 14
అమెజాన్ ప్రైమ్ వీడియో
కార్నివల్ రో (వెబ్‌సిరీస్-2) ఫిబ్రవరి 15
డిస్నీ+హాట్‌స్టార్
సదా నన్ను నడిపే (తెలుగు) ఫిబ్రవరి 16
ద నైట్ మేనేజర్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 17
జె-హోప్ ఇన్ ది బాక్స్(కొరియన్ సిరీస్) ఫిబ్రవరి 17