Prabahs : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా మంది హీరోయిన్లు పడి చచ్చిపోతుంటారు. సౌత్ టు నార్త్ వరకు స్టార్ హీరోయిన్లు సైతం డార్లింగ్ నటనకు ఫిదా అవుతున్నారు. ఒక్కసారైనా ఆయనతో సినిమా చెయ్యాలని ఆశ పడుతున్నారు. ఇండియా వాళ్లు ఆశ పడటం వరకు ఓకే కానీ వేరే దేశంలోని హీరోయిన్లు కూడా ప్రభాస్ అంటే ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో బయట పెడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన ఫేవరెట్ హీరో ప్రభాస్ అని ఇంటర్వ్యూ లో బయటపెట్టింది. అంతేకాదు ప్రభాస్ యాక్టింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రభాస్ పై పాకిస్తానీ హీరోయిన్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత అతని రేంజ్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళింది. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. ఒకవైపు హిట్ సినిమాలు.. మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు డార్లింగ్.. ఆయన అంటే ఫ్యాన్స్ కు మాత్రమే హీరోయిన్స్ కూడా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ పాకిస్తానీ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ఇండియన్ యాక్టర్స్ లో ఏ హీరో అంటే మీకు ఇష్టం అని యాంకర్ అడగ్గా.. ప్రభాస్ అంటే చాలా ఇష్టమని బయట పెట్టేసింది. అతని యాక్టివ్ బాగుంటుంది. ముఖ్యంగా కత్తులతో చేసే ఫైట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఆమె అన్నారు. అతనితో ఒక్కసారైన సినిమా చెయ్యాలని తన మనసులోని కోరికను బయట పెట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అది ప్రభాస్ రేంజ్.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
Also Read : ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కనిపించవు నిర్మాత షాకింగ్ కామెంట్స్..
ప్రభాస్ సినిమాల విషయానికొస్తే..
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సీరిస్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వరుసగా పాన్ ఇండియాలో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు . ప్రతి ఏడాది అర డజను సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. కానీ ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సలార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ తెరకేక్కించిన ఈ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత గత ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులకు పలకరించాడు. ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈ ఏడాది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే హనురాఘపూడి కాంబినేషన్ లో ఫౌజీ మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు అయ్యాక సలార్ 2 కల్కి2 చిత్రాల్లో నటిస్తున్నాడు..
Pakistani actress about prabhas
Anchor :- who is your fav actor in south india ..??
She :- #Prabhas 😊❤️#salaar #Kalki2898AD #bahubali pic.twitter.com/hef6yxapoY
— પ્રભાસ 💫 (@prabharsh_) April 19, 2025