BigTV English

Drishyam 3: వెంకటేష్ కి చెక్ పెట్టిన మోహన్ లాల్..నెక్స్ట్ ఏంటి..?

Drishyam 3: వెంకటేష్ కి చెక్ పెట్టిన మోహన్ లాల్..నెక్స్ట్ ఏంటి..?

Drishyam 3:మలయాళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ (Mohan Lal) నటించిన చిత్రం దృశ్యం (Drishyam). ఈ సినిమా ఫ్రాంచైజీ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఆయా భాషలలో ఆయా దిగ్గజ హీరోలు నటిస్తూ.. కోట్లాది రూపాయల వసూళ్లు అందుకున్నారు. దృశ్యం , దృశ్యం 2 లతో తెలుగు వెర్షన్ లో నటించిన విక్టరీ వెంకటేష్ (Venkatesh ) కి కూడా మంచి పేరు లభించింది.. రాంబాబు పాత్రలో వెంకటేష్ చాలా బాగా నటించాడు. దీంతో ఈ సినిమా కమర్షియల్ గా కూడా బాక్సాఫీస్ వద్ద కళకళలాడింది. అయితే ఇప్పుడు వెంకటేష్ కి మోహన్ లాల్ చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


పాన్ ఇండియా భాషల్లో దృశ్యం 3.. వర్కౌట్ అయ్యేనా..?

దృశ్యం 3 సినిమాను తెరకెక్కిస్తున్న మలయాళ స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ సినిమా పాన్ ఇండియా భాషలలో విడుదలయితే ఇక దృశ్యం 3 హిందీ వెర్షన్ లో అజయ్ దేవగన్ (Ajay Devgan) , తెలుగు వెర్షన్ లో వెంకటేష్ కనిపించే అవకాశం ఉండదు అని తెలుస్తోంది. అయితే మోహన్ లాల్ నటించిన వెర్షన్ ని ఇప్పుడు తెలుగు, హిందీ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అన్నది కూడా చర్చగా మారిందని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ సినిమా ఫ్రాంచైజీ థ్రిల్లర్ కాన్సెప్ట్ కాబట్టి హీరోలతో పనిలేదు అనుకోవడానికి లేదు.ఎందుకంటే హిందీలో అజయ్ దేవగన్, తెలుగులో వెంకటేష్ కి ఉన్న మార్కెట్ మోహన్ లాల్ కి ఉంటుందా? అనే విషయాన్ని కూడా దర్శక నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే పాన్ ఇండియాలో దృశ్యం 3 రిలీజ్ చేయాలనుకుంటే.. ముఖ్యంగా మోహన్ లాల్ స్థాయికి తగ్గ బిజినెస్ జరుగుతుందా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేస్తే బెటర్ అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఒకవేళ ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా కాకుండా ప్రాంతీయ భాషలోనే విడుదల చేస్తే.. ఇటు ఆయా హీరోల మార్కెట్ ను బట్టి రూ.80 నుండి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశాలు వున్నాయి. మరి దీనిపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


వెంకటేష్ సినిమాలు..

వెంకటేష్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో కామెడీ జానర్ ను నమ్ముకొని.. పలు చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు వెంకటేష్.ఈ మధ్యకాలంలో మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో లాగా సక్సెస్ అందుకోలేదు. అలా తన 75వ చిత్రంగా వచ్చిన ‘సైంధవ్’ కూడా ఇలాగే డిజాస్టర్ అయ్యింది. అయితే ఈసారి మాత్రం పక్కా పగడ్బందీగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ అంటూ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే వందకోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×