BigTV English

Kalyan Ram : ఈ కాన్ఫిడెంట్ సరే… కానీ, కంటెంట్‌లో అంత ఉందా..?

Kalyan Ram : ఈ కాన్ఫిడెంట్ సరే… కానీ, కంటెంట్‌లో అంత ఉందా..?

Kalyan Ram : నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ కో ప్రొడ్యూసర్ గా సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్ప సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సయీ ముంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా చిత్ర యూనిట్ మొదటి రోజు కలెక్షన్స్ ని కూడా విడుదల చేశారు. మొదటిరోజు 5.15 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో భాగంగా కళ్యాణ్ రామ్ కలెక్షన్స్ గురించి మాట్లాడారు..


డిస్టిబ్యూటర్స్ హ్యాప్పీ.. బ్రేక్ ఈవెన్ కు దెగ్గరగా..

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..
అర్జున్ S/O వైజయంతి సినిమా మొదటిరోజు పాజిటివ్ టాక్ తో సక్సెస్ ని అందుకుందని.. ఐదు కోట్లకి పైగా వసూలు సాధించిందని తెలిపారు. ‘నాకు బాగా సంతోషాన్ని ఇచ్చిన విషయం డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మా ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసి, సార్ ఈ రెండు రోజుల్లోనే మేము కట్టిన డబ్బులు మాకు వచ్చేస్తున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పడం నిజంగా సంతోషించాల్సిన విషయం. బ్రేక్ ఈవెన్ రేపే సాధిస్తామని చెప్పడం కాదు. ఈ రెండు రోజుల్లోనే మనం బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఉన్నాము. ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థాంక్స్ అని డిస్టిబ్యూటర్స్ చెప్పారు. మీరంతా సినిమాకి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు’ అని కళ్యాణ్ రామ్ ఈవెంట్ లో చెప్పారు. సినిమా నిజంగానే బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుందా అంటే.. కొంతమంది నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ధియేటికల్ బిజినెస్ రూ.21 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. ఈ సినిమా ఇప్పటివరకు ఐదు కోట్లకు పైగా వసూలు సాధించింది. మరో రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. సినిమా ఇదే విధంగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతే ఇది సాధ్యమే అంటున్నారు అభిమానులు.


తల్లి కొడుకుల కధ ..

ఈ సినిమా కథ పాతదే అయినా, తీసిన విధానం కొత్తగా ఉందని తల్లి కొడుకుల ఎమోషన్స్ ని, తల్లి తన బిడ్డ కోసం చేసే త్యాగాన్ని ఇందులో చక్కగా చూపించారు. సినిమాలో శ్రీకాంత్, కమిషనర్ పాత్రలో నటించారు. యాక్షన్, ఎమోషన్స్ సీన్స్ లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. సోహెల్ ఖాన్ పాత్ర నెగిటివ్ రోల్ లో నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు, నందమూరి అభిమానులకు పండుగ లాంటి సినిమా అవుతుందని, కామన్ ఆడియన్స్ ని థియేటర్ వరకు రప్పించగలిగే సినిమా అని అభిమానులు అంటున్నారు..

Kruthi Shetty: అప్పుడే కంప్లీట్… హీరో హీరోయిన్ సూపర్ స్పీడ్ లో ఉన్నారు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×