BigTV English

Virinchi Varma: మెగా హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసిన విరించి వర్మ

Virinchi Varma: మెగా హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసిన విరించి వర్మ

Virinchi Varma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో విరించి వర్మ ఒకరు. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వర్మ. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. షార్ట్ ఫిలిమ్స్ తో ఎంతో గుర్తింపు సాధించుకున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ కావడంతో రాజ్ తరుణ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే కుమారి 21ఎఫ్ సినిమా చూపిస్తా మామ వంటి సినిమాలు రాజ్ తరుణ్ కెరియర్ లో మంచి హిట్ అయ్యాయి. ఇక వరుస హిట్ సినిమాలు రావడంతో తన కెరియర్ గ్యాప్ లేకుండా కొన్నేళ్లపాటు ముందుకు సాగింది. అయితే వరుసగా అవకాశాలు వస్తున్న తరుణంలో సరైన కథలను ఎంచుకోలేక రాజ్ తరుణ్ కెరియర్ కి ఎఫెక్ట్ పడింది. అంతేకాకుండా కొన్ని వివాదాలు కూడా రాజ్ తరుణ్ కు శాపంగా మారాయి.


ఇక దర్శకుడు విరించి వర్మ విషయానికి వస్తే ఆ సినిమా హిట్ కావడంతోనే నాని లాంటి హీరోతో మజ్ను వంటి సినిమాని చేశాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు విరించి వర్మ. ఇక రీసెంట్ గా రాకేష్ వర్రే హీరోగా జితేందర్ రెడ్డి అనే సినిమాను తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ సాధించలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ అయినట్లు చాలామందికి తెలియదు. ఈ సినిమా ఈవెంట్లో రాకేష్ చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. మొత్తానికి విరించి వర్మ ఒక మెగా హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా, గురించి వర్మ దర్శకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత అధికార ప్రకటన చేయనున్నారు.

వైష్ణవ తేజ్ విషయానికొస్తే మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన విప్పిన సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఉపన సినిమా మినహాయిస్తే ఇప్పటివరకు వైష్ణవి కెరియర్ లో సరైన హిట్ సినిమా పడలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఆది కేశవ సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధిస్తుంది అని చాలామంది ఊహించారు. కానీ ఈ సినిమా ఫలితం తేడా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు తన ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు వైష్ణవ్.


Also read : Manchu Manoj: జనసేనలోకి మంచు మనోజ్.. ఇదుగో క్లారిటీ

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×