సాధారణంగా సెలబ్రిటీస్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే క్షణాల్లో పాపులర్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత రెప్ప పాటులో సమాచారం అందరికీ చేరిపోతుంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కి గాయమైందని తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కలవరపాటుకు గురయ్యారు.ఇక తాజాగా దీనిపై స్పందించిన ఆయన సన్నిహితులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. కానీ చివర్లో ట్విస్ట్ ఇవ్వడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
షూటింగ్లో ప్రభాస్ కి గాయాలు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక సినిమా షూటింగ్లో గాయపడ్డారు అంటూ కొన్ని గంటల క్రితం వార్త దావానం లా స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే.జపాన్లో వచ్చే నెల 3వ తేదీన రిలీజ్ కాబోయే ‘కల్కి 2898AD’ సినిమా ప్రమోషన్లకు తాను హాజరు కావట్లేదని, ప్రభాస్ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఒక సినిమా షూటింగ్ జరిగే సమయంలో తన కాలి చీలమండ బెణికిందని , అందుకే ఈ సమయంలో ప్రయాణాలు చేయడం కుదరదని వైద్యులు చెప్పినట్లు ఆయన ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్ల టీం జపాన్లో ప్రమోషన్స్ చేస్తుందని,దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించగలరు అంటూ కూడా తెలిపారు ప్రభాస్. ఇక దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ గాయం పై స్పందించిన సన్నిహితులు..
అయితే వరుసగా ట్వీట్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన సన్నిహిత వర్గాలు స్పందించాయి. ప్రభాస్ గాయం పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదు. ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు ‘రాజాసాబ్’ టాకీ కూడా పూర్తయింది. కాబట్టి ఈ సినిమాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో చేసే ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ కి మాత్రం బ్రేక్ పడుతుంది. అయితే అది కూడా ఆయన త్వరగా కోలుకొని షూటింగ్ మళ్లీ మొదలుపెడతారు అంటూ అసలు విషయాన్ని చెప్పి అభిమానులకు టెన్షన్ తగ్గించారు. ఇకపోతే రాజాసాబ్ సినిమా విడుదలవుతుందని చెప్పారు. కానీ ఫౌజీ షూటింగ్ కి కాస్త బ్రేక్ పడుతుందని చెప్పడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ తమ అభిమాన హీరో త్వరగా కోలుకొని రావాలి అని మళ్ళీ ఎప్పటిలాగే అభిమానులను అలరించాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలు..
ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ఈ ఏడాది వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin)దర్శకత్వంలో ‘కల్కి 2898AD’ సినిమా చేశారు. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్ వంటి కీలక తారాగణం భాగం పంచుకున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్, హనురాగవపూడి దర్శకత్వంలో ఫౌజి సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి2 చిత్రాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. ఏదేమైనా ఈ చిత్రాలన్నింటితో కూడా తన పాన్ ఇండియా మార్కెట్ ను మరింత పెంచుకోబోతున్నారని చెప్పవచ్చు.