Manchu Manoj: మంచు కుటుంబంలో అసలు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరం కావడం లేదు. ఈ ఆస్తి తగాదాలు చివరకి అన్నదమ్ములు ఒకరినొకరు ప్రాణాలను తీసుకొనేవరకు వెళ్ళింది. తన కుటుంబాన్ని మంచు విష్ణు చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని మంచు మనోజ్ పోలీసులకు పిర్యాదు ఇచ్చాడు. తమకు ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు.
“మంచు విష్ణు.. తన అనుచరులు అయిన రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డి, మరికొందరు బౌన్సర్లతో కలిసి మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించాలనే కారణంతో ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. కానీ, వారు కావాలనే విధ్వంసం సృష్టించడానికి ఇంటికి వచ్చారు. వాళ్లు మా ఇంట్లోని జనరేటర్లను ట్యాంపర్ చేశారు. అవి పనిచేయకుండా ఉండడంకోసం చక్కెర కలిపిన డీజిల్‌ను పోశారు.
అర్థరాత్రి జనరేటర్లు పనిచేయడం ఆగిపోయాయి. ఇంట్లో మా అమ్మ, నా 9 ఏళ్ల కూతురితో పాటు ఊరి నుండి వచ్చి అత్త, మామ కూడా ఉన్నారు. జనరేటర్స్ దగ్గరే వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. దాని వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగి మా ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది.. మా అన్న విష్ణు వలన మాకు ప్రాణహానీ ఉందని” మంచి మనోజ్ ఫిర్యాదులో తెలిపాడు.
Atlee: స్టార్ డైరెక్టర్ లుక్స్ ను హేళన చేసిన కపిల్.. ఇచ్చిపడేసిన అట్లీ
ఇక ఈ గొడవల నేపథ్యంలోనే మనోజ్ దంపతులు జనసేనలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. నేడు మనోజ్ భార్య మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి కావడంతో ఇద్దరు దంపతులు భూమా ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మనోజ్ మాట్లాడుతూ.. ” ఈరోజు మా అత్తయ్య గారి జయంతి. అందుకోసమే మొట్టమొదటిసారి మా కూతురు దేవసేన శోభాను తీసుకొని ఆళ్లగడ్డకు వచ్చాము. ఈరోజు తీసుకొద్దామనే ఇన్నాళ్లు పాపను అక్కడే ఉంచాము. ఈరోజు మా కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఎక్కడికి వచ్చాము. ఊళ్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రేమగా చూసుకున్నారు.. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా భమా కుటుంబానికి థాంక్స్. రాయలసీమ నుంచి నాకోసం వచ్చిన అభిమానులకి థాంక్స్ చెప్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.
Despatch Movie : హద్దులు దాటిన ఫ్యామిలీ మ్యాన్ రొమాన్స్… ఏకిపారేస్తున్న నెటిజన్లు
ఇక వెంటనే ఒక రిపోర్టర్ మీరు జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. దానిపై మీ స్పందన ఏంటి అని అడగ్గా మనోజ్ సైలెంట్ గా నో కామెంట్స్ అంటూ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక దీంతో అభిమానుల్లో ఒక క్లారిటీ వచ్చేసింది.. నో కామెంట్స్ అన్నాడు కానీ, అదేమీ లేదని చెప్పలేదు కాబట్టి కచ్చితంగా జనసేనలోకి మనోజ్ దంపతులు వెళ్తారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఎలాగూ భూమా నాగిరెడ్డి కుటుంబం మొత్తం టీడీపీనే కాబట్టి.. మనోజ్ సైతం అటు వైపే వెళ్లాలని చూస్తున్నాడు. రాజకీయంగా ఎదగడానికి మనోజ్ దంపతులు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆస్తి వివాదాలు కూడా ఇప్పుడప్పుడే తేలేలా అనిపించడం లేదు. మరి మంచు వారసుల ఆస్తి తగాదాలు ఎక్కడివరకు వెళ్లి ఆగుతాయో.. ? చివరికి మోహన్ బాబు ఎవరెవరికి ఎంతెంత ఇస్తాడో అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.