Director Parasuram: గీతాగోవిందం మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న డైరెక్టర్ పరుశురాం.. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేశాడు. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది.. కానీ అనుకున్న టాక్ ను అందుకోలేక పోవడంతో సినిమా మిక్సీ్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో క్రేజీ హీరోతో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.. తాజాగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు..
‘ఫ్యామిలీ స్టార్ ‘ తర్వాత పరిశురామ్ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరు అనుకుంటుండుగా తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేశారు. తమిళ హీరో కార్తి కోసం ఆయన ఓ కథ రెడీ చేసుకొన్నారు.. కానీ ఏదో కారణంతో ఆ సినిమా సెట్ కాలేదు. ఆ కథ క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ వరకు చేరింది.. ఈ సినిమాకు దాదాపుగా రంగం సిద్ధమైందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్‌లో రూపొందించే అవకాశాలు ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డతో దిల్ రాజు ఓ సినిమా చేయాలని ఇది వరకే ఒప్పందం చేసుకొన్నారు. ఈ మేరకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా చేసేటప్పుడే మరో సినిమా చేసేందుకు పరుశురాం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి..
అలా.. ఈ డైరెక్టర్ ను , హీరోను ముడి పెట్టేశారు నిర్మాత దిల్ రాజు. అయితే కార్తి కోసం అనుకొన్న కథే… ఇప్పుడు సిద్దుతో చేస్తున్నారా? లేదంటే కొత్తగా సిద్దు క్యారక్టర్ కు తగ్గట్లే కథను రెడీ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ‘తెలుసు కదా’ అనే మరో ప్రాజెక్టు నడుస్తోంది. ఇవి రెండూ దాదాపుగా పూర్తికావొచ్చాయి.. ఆ తర్వాత టిల్లు క్యూబ్ సినిమాకు రంగం సిద్ధం చేసాడని ఇండస్ట్రీలో టాక్… ఆ రెండు సినిమాలు అయ్యాక పరుశురాం తో సినిమాతో చెయ్యనున్నాడని తెలుస్తుంది.. వీరిద్దరి కాంబోలో ఎలాంటి స్టోరీతో సినిమా వస్తుందా అని సిద్దు ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో.. త్వరలోనే పూర్తి వివరాలను టీమ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం..