Priyanka Jain : ప్రియాంక జైన్ (Priyanka Jain) .. సీరియల్స్ ద్వారా ఒకప్పుడు భారీ పాపులారిటీ అందుకున్న ఈమె బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టింది. అక్కడ తన ఆట తీరుతో అందరినీ మెస్మరైజ్ చేసింది. అంతేకాదు తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పించిన ఈమె టాప్ ఫైవ్ ఫైనలిస్టులో ఏకైక లేడీగా నిలిచి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక అలాంటి ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచీ బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పలు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుపొందిన ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు వెళ్ళింది. వాస్తవానికి ఈ మహా కుంభమేళా 144 సంవత్సరాల తర్వాత రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు త్రివేణి సంఘంలో పవిత్ర స్నానాలు చేయడానికి పోటెత్తారు. అటు సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ నాయకులు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో ఇప్పటికే సంయుక్త మీనన్, బిందు మాధవి, యాంకర్ లాస్య, శ్రీనిధి శెట్టి, పవిత్ర గౌడ , పూనమ్ పాండే వంటి ప్రముఖులు కుంభమేళాలో తలుక్కుమన్నారు.
మహా కుంభమేళాలో పుణ్యస్నానం.. నెటిజన్స్ ట్రోల్స్..
తన ప్రియుడు బుల్లితెర నటుడు శివ కుమార్ (Siva kumar) తో కలిసి ఈ ఆధ్యాత్మిక వేడుకలలో పాల్గొన్నారు. త్రివేణి సంఘమంలో పుణ్య స్థానాలు ఆచరించిన వీరు ఆ తర్వాత కుంభమేళాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు . దీంతో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన చాలామంది పాజిటివ్ గానే స్పందించారు. కానీ అదే సమయంలో మరికొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. దేవుడి దగ్గరికి కూడా మీరు ఫోటోషూట్స్, రీల్స్ కోసం వెళ్లడం అవసరమా? అన్నట్లు కామెంట్లు చేశారు. ఇంకొంతమంది మీరు వెళ్ళింది భక్తి కోసమా? లేక ఇన్స్టా స్టోరీల కోసమా? భక్తిశ్రద్ధలతో చేయాల్సిన పూజలను ఇలా ఫోటోలు, వ్లాగ్స్ కోసం చేస్తారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా మహా కుంభమేళాకు వెళ్లి తమ అనుభూతులను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొంతమంది వీటిపై నెగిటివ్ గా స్పందిస్తూ.. విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.
దైవభక్తితో మునిగితేలుతున్న ప్రియాంక..
ఇకపోతే ప్రియాంక జైన్ తో కొద్ది రోజులుగా తన ప్రియుడితో కలిసి పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ బిజీ బిజీగా మారింది. ఇక ఈ మహా కుంభమేళ తర్వాత ఆమె కాశీలో ప్రత్యక్షమైంది. వీటికి సంబంధించిన విశేషాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది ప్రియాంక జైన్. ఏది ఏమైనా ప్రియాంక జైన్ చేస్తున్న వీడియోలు కొంతమందికి సమాచారాన్ని ఇస్తున్నా.. మరి కొంత మంది దీనిని విమర్శిస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రియాంక జైన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.