Fact Check: దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్.ఆర్.ఆర్ సినిమాకి ఆస్కార్డ్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగింది. అమెరికాలో జరిగిన 95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు వరించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ నాటు నాటు పాటకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Also Read: Marcus Stoinis Retirement: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్!
ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ నాటు నాటు స్టెప్పులకు కాలు కదపకుండా ఉండలేరేమో అనేలా ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ స్టార్ డమ్ వచ్చింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించడంతో పలు అంతర్జాతీయ వేదికల మీద జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు ఏకంగా ఫిఫా {FIFA} తన సోషల్ మీడియా పోస్టులో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాల పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది ఫుట్ బాల్ అసోసియేషన్ {ఫిఫా}.
ఈ పోస్టర్ లో ఫుట్ బాల్ దిగ్గజాలు నేయ్ మార్, టెవెజ్, రోనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది. వీరి పేర్లలోని తొలి అక్షరాలతో NTR పేరు వచ్చేలా పోస్టర్ ని విడుదల చేసింది. అంతే కాదు ఈ పోస్టర్ లో ఈ ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు నాటు నాటు పాటకి స్టెప్పులు వేస్తున్నట్లు పోస్టర్ ని క్రియేట్ చేసింది. ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఆ ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేశారు.
క్షణాల్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఈ పోస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. “హ హ.. హ్యాపీ బర్త్ డే నెయ్ మార్, టెవెజ్, రోనాల్డో ” అని కామెంట్ చేశారు. ఇదే క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ స్పందిస్తూ.. మూడు హార్ట్ సింబల్స్ ని పోస్ట్ చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన మేజర్ ఫుట్ బాల్ టోర్నీ అయిన ఫిఫా వరల్డ్ కప్ తమ అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఎన్టీఆర్ పేరుతో పోస్ట్ చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ind vs Eng 1st ODI: నేటి నుంచే వన్డే సిరీస్..టైమింగ్స్ ఇవే..ఉచితంగా ఇలా చూడండి ?
జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అని ప్రూవ్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 అనే హిందీ చిత్రంలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ 31 ని ప్రారంభిస్తారు. అయితే FIFA వరల్డ్ కప్ కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌లో RRR-నేపథ్య ఎన్టీఆర్ లోగో, అలాగే స్టార్ ప్లేయర్ల ఫోటోలు ఉన్నయన్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్ నిన్నటి నుంచి వైరల్ అయింది. అయితే… ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… FIFA వరల్డ్ కప్ కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఇండియాకు సంబంధించినదట. అంటే ఎన్టీఆర్ లోగో కేవలం ఇండియాలోనే కనిపిస్తుందని అంటున్నారు. కానీ… USA లేదా ఇతర దేశాలలో.. ఎన్టీఆర్ లోగో కనిపించదు. ఇతర దేశాల్లో కేవలం స్టార్ ప్లేయర్ల ఫోటోలు ఉంటాయని సమాచారం.
Looks like @FIFAWorldCup has removed NTR post in other parts of the world 😐😐
The Team has projected this as a global post where as it’s clearly dedicated only for India! Strange that the hero commented and @RRRMovie posted this…. https://t.co/rNjb2xSdR7 pic.twitter.com/bveFsr0YUh
— Mana Stars (@manastarsdotcom) February 5, 2025