E-Paper
Advertisement

Pawan Kalyan Daughters: వివాదాలన్నీ పక్కన పెడితే.. ఈ అక్కాచెల్లెళ్లు ఎంత ముద్దుగా ఉన్నార్రా..

Pawan Kalyan Daughters: వివాదాలన్నీ పక్కన పెడితే.. ఈ అక్కాచెల్లెళ్లు ఎంత ముద్దుగా ఉన్నార్రా..
Advertisement

Pawan Kalyan Daughters: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఆయనే సెన్సేషన్. ఇక ఇప్పుడు  ఏపీ డిప్యూటీ స్మ్  పవన్ కళ్యాణ్ గా ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆయనే సెన్సేషన్.  పవన్ గురించి కానీ, ఆయన భార్యల గురించి కానీ, ఆయన పిల్లల గురించి కానీ.. ఏ న్యూస్ వచ్చినా  క్షణాల్లో వైరల్ గా మారుతుంది.  పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ పెట్టినా.. పవన్ రెండో భార్య అన్నా లెజినోవో సోషల్ మీడియాలో కనిపించినా.. వారి పిల్లలు, ముఖ్యంగా వారసుడు అకీరా నందన్ ఎయిర్ పోర్ట్ లో కనిపించినా.. పవన్ పక్కన కూతురు ఆద్య   కనిపించినా .. ఇలా ఏది జరిగినా ఆరోజంతా వారి గురించే చర్చ.

ఇక నేడు అంతకు మించి సెన్సేషన్ సృష్టించారు. ఈరోజు పవన్ మూడో కూతురు పోలెనా అంజనా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది. అన్నా లెజినోవోకు పుట్టిన కుమార్తె పోలెనా. నిజం చెప్పాలంటే అన్నా  పిల్లలు ఎప్పుడు బయట కనిపించరు. మెగా వేడుకల్లోనో.. ఎయిర్ పోర్ట్ లోనో చాలా రేర్ గా కనిపిస్తారు. అప్పుడెప్పుడో నిహారిక పెళ్లిలో పవన్ పిల్లలందరూ కనిపించారు. ఇక ఇప్పుడు  పవన్ ఇద్దరు కూతుళ్లు ఒకదగ్గర కనిపించి కనువిందు చేశారు.

Advertisement

రేణు.. తన భర్త తనను మోసం చేశాడు అనే బాధతో దూరమైనా.. పిల్లలను ఎప్పుడు తండ్రికి దూరం చేయలేదు. అకీరా, ఆద్య ఎప్పుడు  మెగా  వారసులే. ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన దగ్గరనుంచి అకీరా, ఆద్య.. ఎప్పుడు పవన్ పక్కనే ఉంటున్నారు. ఇక ఇప్పుడు వీరితో పాటు అన్నా పిల్లలు కూడా యాడ్ అయ్యారు. నేడు  తిరుమలకు పవన్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి వెళ్లి  స్వామివారి దర్శనం చేసుకున్నారు. అక్కచెల్లెళ్ళిద్దరు ఎంతో అందంగా ముద్దుగా కనిపించారు. ఒకే కలర్ డ్రెస్ లో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంతో అందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన  వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ , రేణు విడాకులు, ఈ వివాదాలు అని పక్కన పెడితే.. పవన్ పిల్లలందరూ కలిసే  పెరుగుతున్నారు. వారికి తండ్రిగా పవన్ ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాడో అంత చేస్తున్నాడు. ఇక ఇటు అన్నా కానీ, అటు రేణు కానీ పిల్లల మీద ఎప్పుడు అసహనం చూపించిది లేదు. నిజం చెప్పాలంటే.. అకీరా,  ఆద్య.. ఎక్కువ అన్నా దగ్గరే పెరిగారట. అంతలా ఈ ఇద్దరు తల్లులు తమ పిల్లలను పెంచారు.  అకీరా, ఆద్య, పోలెనా అంజనా, మార్క్ పవనోవిచ్.. నలుగురు పిల్లలు కూడా  ఎలాంటి భేదాలు లేకుండా ప్రేమతో ఉంటున్నారు.

Advertisement

ఇక ఈ వీడియోలో ఆద్య, పోలెనా చక్కగా మాట్లాడుతూ, నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా ఆద్య ఒక అక్కలా.. తన చెల్లికి అన్ని నేర్పుతున్నట్లు కనిపించింది. ప్రస్తుతం  ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భార్యల విషయంలో పవన్ ను తప్పుపట్టినా.. పిల్లల విషయంలో మాత్రం ఒక తండ్రిగా పవన్ ను అందరు ప్రశంసిస్తూన్నారు. ఇక అకీరా, ఆద్య, పోలెనా కనిపిస్తేనే ఈ రేంజ్ రచ్చ ఉంటే.. ఇక చివరి వారసుడు మార్క్ మీడియా ముందుకు వస్తే ఇంకెంత రచ్చ ఉంటుందో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి మార్క్ పవనోవిచ్ ఆగమనం ఎప్పుడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×