Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో నాలుగు వారాలు గడిచాయి. ఆ నాలుగు వారాల్లో ప్రతీవారం హౌస్‌కు ఒక కొత్త చీఫ్ కోసం పోటీ జరుగుతూనే ఉంది. ఇక అదృష్టంకొద్దీ నిఖిల్ మాత్రం తన చీఫ్ స్థానాన్ని పోకుండా కాపాడుకుంటూ ఉన్నాడు. తనతో పాటు ఇప్పటివరకు నైనికా, యష్మీ, అభయ్, సీత కూడా చీఫ్స్ స్థానాన్ని దక్కించుకొని కొన్నాళ్ల పాటు దానికి వచ్చిన ప్రయోజనాలను ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మరోసారి చీఫ్స్ స్థానం కోసం పోటీ మొదలయ్యింది. ఇక చీఫ్ అవ్వాలని బలమైన కోరికతో ఉన్న కంటెస్టెంట్స్.. ఫ్రెండ్‌షిప్‌ను సైతం పక్కన పెట్టేశారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
మణికంఠకు వార్నింగ్
బిగ్ బాస్ హౌస్‌లోని గార్డెన్ ఏరియాలో కొన్ని కుక్క బొమ్మలు పెట్టి ఉంటాయి. అందులో ప్రతీ బొమ్మపై కంటెస్టెంట్స్ పేర్లు రాసి ఉంటాయి. బజర్ మోగిన వెంటనే తమ చేతికి దొరికిన కుక్క బొమ్మను అందుకొని ఒకవైపు నుండి మరోవైపుకు పరిగెత్తాలి హౌస్‌మేట్స్. చివరిగా వచ్చిన కంటెస్టెంట్, వారి చేతిలో ఉన్న కుక్క బొమ్మపై పేరు ఉన్న కంటెస్టెంట్.. ఇద్దరూ చీఫ్ స్థానం కోసం ఎందుకు అర్హులో చెప్పుకుంటారు. ఇక ఆ ఇద్దరిలో హౌస్‌మేట్స్‌కు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటారో వారికి చేస్తారు. అలా ప్రతీ రౌండ్‌లో ఒకరు ఔట్ అయిపోతారు. మణికంఠ వల్ల యష్మీ ఔట్ అయిపోయింది. దీంతో ‘‘నన్ను రేస్ నుండి తీశావు చూసుకుందాం’’ అనే టైప్‌లో వార్నింగ్ ఇచ్చింది.
Also Read: చీఫ్ కోసం గొడవ.. కొట్టుకు చచ్చేలా ఉన్నారే..?
ఫ్రెండ్స్ మధ్యే గొడవలు
ప్రేరణ, నైనికా గొడవతో తాజాగా విడుదలయిన ప్రోమో మొదలవుతుంది. ఆమె బ్లాక్ చేస్తుంది అంటూ ప్రేరణ గురించి ఆరోపించింది. అది విన్న ప్రేరణ.. నోటికొచ్చింది మాట్లాడకు అంటూ తనకు వార్నింగ్ ఇచ్చింది. తను అలాగే ఆడుతుందని ఎలా అంటావని అరిచింది. దానికి నైనికా కూడా గట్టి సమాధానమిచ్చింది. ఇక ప్రేరణ, విష్ణుప్రియా చీఫ్ రేసులో ఉండగా.. ‘‘ఎనిమిది మందిని ఆపాలి, వారికి ఒక లీడర్ ఉండాలి, వారికి గట్టిగా చెప్పాలి.. ఇవన్నీ ఆలోచిస్తే నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తాను’’ అని అభిప్రాయం వ్యక్తం చేసింది యష్మీ. దీంతో విష్ణుప్రియా రేసు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నైనికా వర్సెస్ సీత చీఫ్ రేసులోకి వచ్చారు.
మంచి నిర్ణయాలు తీసుకోలేదు
నైనికా, సీత.. ఇద్దరూ చీఫ్స్ అవ్వడానికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చెప్పుకొచ్చారు. వీరిద్దరిలో నుండి ఒకరిని రేసు నుండి తొలగించే అవకాశం విష్ణుప్రియాకు రావడంతో తను నైనికాకు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పింది. ‘‘నేను టాస్కుల్లో అందరికీ అవకాశం ఇచ్చి తప్పు చేశానని అంటున్నావా’’ అంటూ సీత ఎదురుతిరిగింది. ‘‘నిర్ణయాలు తీసుకునే విషయంలో మరింత బాగా ఆలోచించి ఉండవచ్చు’’ అని ముక్కుసూటిగా సమాధానమిచ్చింది విష్ణుప్రియా. దీంతో సీత కూడా చీఫ్స్ రేసు నుండి తప్పుకుంది. అలా ఒక్కొక్కరిగా రేసు నుండి తప్పుకుంటూ ఉండడంతో అసలు ఈవారం చీఫ్ ఎవరు అవుతారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కూడా మొదలయ్యింది.