E-Paper
Advertisement

Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మీ ముందుకు ‘ధర్మం కోసం యుద్ధం’

Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మీ ముందుకు ‘ధర్మం కోసం యుద్ధం’
Advertisement

Hari Hara Veeramallu Teaser Update(Latest news in tollywood): పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా మారిపోయాడు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయినా పవన్ లేని కొన్ని సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే పవర్ స్టార్ నటిస్తున్న పలు సినిమాలలో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్ని మంత్రముగ్దులను చేశాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం నుంచి ఒక్క అప్డేట్ అయినా వస్తుందేమో అని సినీ ప్రియులు, అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ సరికొత్త సర్ప్రైజ్ అందించారు.

Advertisement

ఈ రోజు శ్రీరామ నవమి పండుగ కావడంతో మేకర్స్ పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ అందించారు. ఇందులో భాగంగా ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో ‘‘మీ ముందుకు ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో..’’ అంటూ రాసుకొచ్చారు. దీనిబట్టి చూస్తే.. అతి త్వరలోనే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: ‘హరిహర వీరమల్లు’ టీజర్‌ డేట్ చెప్పేసిన నిర్మాత

Advertisement

కాగా రిలీజ్ అయిన ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ కత్తిని చూపిస్తూ.. వేటకు వెళ్లేటప్పుడు సింహం కళ్లు ఎలా ఉంటాయో అలా పవన్ రెండు కళ్లు ఉన్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మరింది. ఈ ట్రీట్‌తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇకపోతే పవన్ ఈ సినిమాతో పాటు మరికొన్న సినిమాలను కూడా చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజీత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ ఫుల్ హైప్ ఉంది. అలాగే తనకు ‘గబ్బర్ సింగ్’తో సూపర్ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో సినిమా చేస్తున్నాడు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×