BigTV English

Pushpa movie: దీనవ్వా తగ్గేదే లే.. ఆరెంజ్ ఆర్మీపై ‘పుష్ప’ టీం ప్రశంసలు..

Pushpa movie: దీనవ్వా తగ్గేదే లే.. ఆరెంజ్ ఆర్మీపై ‘పుష్ప’ టీం ప్రశంసలు..

Pushpa movie team on SRH(Cinema news in telugu): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న పుష్ప 2 మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ విజయాన్ని అందుకున్న తర్వాత ‘పుష్ప’ టీంపై మరింత భారం పడింది. అందువల్ల ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంటే మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ని మూవీ టీం కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ నుంచి ఇదివరకే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్ల కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో పుష్ప టీం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పుష్ప టీం చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇప్పుడంతా ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ము దులిపేస్తోంది. ఏ టీం అయినా.. ఎలాంటి బౌలర్ అయినా సన్‌రైజర్స్ దెబ్బలకు షాక్ అవుతున్నారు.


Also Read: పుష్ప 2 టీజర్ సెన్సేషనల్ రికార్డు.. ఆనందం వ్యక్తం చేసిన మూవీ టీం!

దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పుష్ప సినిమాతో పోలుస్తూ మూవీ టీం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఇటీవలే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఆ తర్వాత బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టింది.

దీంతో పుష్ప టీం.. మొదటి మ్యాచ్‌ను పుష్ప పార్ట్ వన్‌గా, రెండో మ్యాచ్‌ను పుష్ప పార్ట్ 2గా పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ మేరకు రెండు సార్లు భారీ స్కోర్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు, అభిమానులు పుష్ప మూవీలోని డైలాగ్‌లతో కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×