Big Stories

Paris Olympics 2024: కేవలం వంద రోజులు, పారిస్ ఒలింపిక్స్ పొంచివున్న ముప్పు?

Paris Olympics 2024: కేవలం వంద రోజుల్లో మెగా క్రీడా సంబరం మొదలుకానుంది. అందుకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ పుట్టినిల్లు గ్రీస్‌లో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఒలింపియా ప్రాంతంలో వైభవంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది మంది క్రీడా అభిమానుల సమక్షంలో కార్యక్రమం జరిగింది.

- Advertisement -

ఫ్రెంచ్ నటి మారియా జ్యోతిని వెలిగించి, మరో క్రీడాకారునికి అందజేసింది. మంగళవారం మొదలైన ఒలింపిక్ జ్యోతి ఒక్క గ్రీస్‌లో ఐదువేల కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఏప్రిల్ 26న పారిస్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ వద్దకు చేరనుంది. అనంతరం ఈ జ్యోతిని ప్రపంచంలోని వివిధ దేశాలకు తీసుకెళ్తారు.

- Advertisement -
Paris Olympics 2024
Paris Olympics 2024

ఇదిలావుండగా ఒలింపిక్స్ సెక్యూరిటీ అంశం పెద్ద ఇష్యూగా మారనున్నట్లు కనిపిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ మాత్రం ప్రారంభోత్సవ వేదికను ప్లాన్ చేసిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతాని కి మార్చాలని పట్టుబడుతున్నారట. దీనికి కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు సమస్య కూడా వెంటాడుతోందని అంటున్నారు. దీనికితోడు రీసెంట్‌గా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంఘటనలను ప్రస్తావించారు. మార్చిలో రష్యాలోని ఓ హాల్‌లో జరిగిన ఘటనను గుర్తుచేశారు.

మరోవైపు సైబర్‌ దాడులు జరగవచ్చన్న నివేదికలు లేకపోలేదు. నిర్వాహకులకు ఇప్పటికే హ్యాకర్స్ నుంచి వార్నింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్యూటర్ సెంటర్లలో హెచ్చరికతో కూడిన ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ALSO READ: ఇద్దరికి గెలుపు ముఖ్యమే.. నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్

ఇక ఒలింపిక్స్‌కు మూడు సార్లు ఆతిధ్యమిస్తున్న రెండో సిటీ పారిస్. గతంలో 1900, 1924లో ఇక్కడే ఒలింపిక్స్ జరిగాయి. లండన్ కూడా మూడుసార్లు ఒలింపిక్స్ నిర్వహించింది. జులై 26 నుంచి మొదలై ఆగష్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి. మొత్తం 32 క్రీడాంశాలు ఉంటాయి. ఇందుకోసం 35 వేదికలను రెడీ చేశారు. దాదాపు 10 వేలకు పైగా క్రీడాకారులు హాజరుకాన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News