Pawan Kalyan : మళ్లీ పాట పాడబోతున్న పవన్ కళ్యాణ్.. ఆయన రిక్వెస్ట్ మేరకే!

Pawan Kalyan : మళ్లీ పాట పాడబోతున్న పవన్ కళ్యాణ్.. ఆయన రిక్వెస్ట్ మేరకే!

Share this post with your friends

pawan

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమాల్లో నాలుగు లైన్‌లో ఉన్నాయి. అందులో ఒక‌టి హరిహరవీరమల్లు. దీనికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌, నోరా ఫతేహీ, బాబీ డియోల్‌, విక్రమ్‌ జీత్‌ కీ రోల్స్ చేస్తున్నారు. 17వ శాతాబ్దపు బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కుతోంది హరిహరవీరమల్లు. మొఘల్‌ సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్‌ ఉంటుంది. సెప్టెంబర్‌ 2020లో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ మొదలుపెట్టారు మేకర్స్. కోవిడ్‌ వల్ల, పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ కమిట్‌మెంట్స్ వల్ల చిత్రీకరణలో జాప్యం జరిగింది. ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. ఎ.దయాకరరావు నిర్మిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇందులో తెలంగాణకు చెందిన పండగ సాయన్న రోల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబిన్ హుడ్ పాత్ర‌దారిగా క‌నిపిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా మ‌రో న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటేంటే హ‌రి హ‌ర వీర మ‌ల్లు సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాట‌ను పాడ‌బోతున్నార‌ట‌. గ‌తంలో రెండు, మూడు సార్లు పాట పాడి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను అల‌రించారు. మ‌రోసారి అదేలా మ‌రోసారి ప‌వ‌న్ గొంతు స‌వ‌రించుకోనున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి రిక్వెస్ట్ మేర‌కే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి పాట పాడ‌టానికి ఒప్పుకున్నార‌ట‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తోన్న సినిమాల్లో హ‌రి హ‌ర వీర మ‌ల్లు భారీ బ‌డ్జెట్ మూవీగానే కాదు.. పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ ప్ర‌స్తుతం వినోద‌య సిత్తం రీమేక్‌తోపాటు, ఓజీ సినిమాల్లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లలోపు త‌న చిత్రాల‌ను పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌క చ‌కా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Pink Flowers : గులాబీ రంగు పువ్వులు ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

BigTv Desk

Ponnam Prabhakar : రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం ఓ కల : పొన్నం ప్రభాకర్

BigTv Desk

Madhapur drugs case: డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

Bigtv Digital

Rahul Gandhi: ఏక్ అకేలా రాహుల్‌.. బీజేపీకి టన్నుల్లో భయం!

Bigtv Digital

Puttaparthi : ఘనంగా పుట్టపర్తి సత్యసాయి 97వ జయంత్యోత్సవాలు..

BigTv Desk

AP Central University : ఏపీ సెంట్రల్‌ వర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం..

BigTv Desk

Leave a Comment