Reservation Rotation: దేశంలో ఇప్పుడొక కొత్త చర్చ మొదలైంది. అది ఆసక్తిగా కూడా ఉంది. పంచాయితీలు, మండలాలు, జడ్పీ, మునిసిపాలిటీలాగే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు కూడా రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు కూడా మార్చాలని.. ఒక నియోజకవర్గం డెబ్బై ఏళ్లు, ఆరవై ఏళ్ల నుంచి ఒకే వర్గానికి రిజర్వ్ కావడం వల్ల ఆ నియోజకవర్గంలో ఉండే ఇతరులకు పోటీ చేసే అవకాశం, ఇతరులకు ఓట్లేసే అవకాశం రావడం లేదని.. అందుకే ఎంపీ, ఎమ్మెల్యే రిజర్వ్డ్ సీట్లకూ రొటేషన్ పెట్టాలనేది ఈ కొత్త చర్చ. మరి దీనికి అవకాశం ఉందా? అసలు నియోజకవర్గాలను ఎలా రిజర్వ్ చేస్తారు? ఇప్పుడా సమస్య ఎందుకు చర్చకు వచ్చిందనేది చూద్దాం.
ఎస్సీ అభ్యర్థికే ఓటు వేయాలా?
ఉత్తరప్రదేశ్లో ఒక నియోజకవర్గం ఉంది. దాని పేరు కడిపుర్. నెంబర్ 191. ఆ సీటు పుట్టినప్పటి నుంచి, అంటే దాదాపు 70 ఏళ్లుగా, కేవలం ఎస్సీలకే రిజర్వ్ అయ్యింది. అక్కడి ఓటరు జగదీశ్ సింగ్ అడుగుతున్నాడు – ‘70 ఏళ్లుగా నేను ఎస్సీ అభ్యర్థికే ఓటు వేయాలా? నాకు వేరే వాళ్ళని ఎన్నుకునే హక్కు లేదా? ఈ సీటును ఎప్పుడైనా మారుస్తారా?లేదా? అనే ’ ఈ ప్రశ్నతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు నవంబర్ 4, 2026న ఏం చెప్పిందో తెలుసా?
దేశంలో రిజర్వేషన్ లెక్క ఎలా ఉందో చూద్దాం..
దాని కంటే ముందు ముందు దేశంలో రిజర్వేషన్ లెక్క ఎలా ఉందో చూద్దాం. దేశంలో మొత్తం లోక్సభ సీట్లు – 543. అందులో ఎస్సీలకు – 84 సీట్లు, ఎస్టీలకు – 47 సీట్లు రిజర్వ్ చేశారు. అంటే మొత్తం 131 సీట్లు, అంటే 24% సీట్లు రిజర్వ్డ్.అసెంబ్లీల్లో ఈ రిజర్వ్డ్ సీట్లది ఇంకా పెద్ద లెక్క. దేశంలో మొత్తం ఎమ్మెల్యే సీట్లు – 4,120. అందులో ఎస్సీలకు – 614 సీట్లు, ఎస్టీలకు – 554 సీట్లు. లోక్సభలో ఎస్సీ సీట్లు ఎక్కువ ఉంది. ఉత్తరప్రదేశ్లో – 17 సీట్లు. అక్కడ మొత్తం ఎంపీ సీట్లు 80. ఎస్టీ సీట్లు ఎక్కువ ఉన్నది మధ్యప్రదేశ్లో అక్కడ – 6 సీట్లు. అసెంబ్లీలో కూడా యూపీనే టాప్ – 403 సీట్లలో 85 ఎస్సీ, అక్కడ ఎస్టీలకు సీట్లు లేవు. ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఎక్కువ ఉన్నది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో.
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్:
ఎంపీ సీట్లు 25 – అందులో ఎస్సీ 4, ఎస్టీ 1. అంటే అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు ఎస్సీ. అరకు ఎస్టీ. అమలాపురం 1967 నుంచి59 ఏళ్లుగా,ఇప్పటివరకు జరిగిన – 14 లోక్సభ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఎస్సీ అభ్యర్ధులకే ఓట్లేస్తున్నారన్న మాట.
తిరుపతి 1977 నుంచి49 ఏళ్లుగా చిత్తూరు 1977 నుంచి49 ఏళ్లుగా ఎస్సీలకు రిజర్వ్ అయ్యి ఉన్నాయి. ఎమ్మెల్యే సీట్లు 175 – అందులో ఎస్సీ 29, ఎస్టీ 7.
తెలంగాణ:
ఎంపీ సీట్లు 17 – అందులో ఎస్సీ 3, ఎస్టీ 2. పెద్దపల్లి, వరంగల్, నాగర్కర్నూల్ ఎస్సీ. ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ. పెద్దపల్లి 1962 నుంచి64 ఏళ్లుగా నాగర్కర్నూల్ 1977 నుంచి49 ఏళ్లుగా వరంగల్ 2009 నుంచి మాత్రమే17 ఏళ్లుగా ఆదిలాబాద్ST1977 నుంచి49 ఏళ్లుగా మహబూబాబాద్ST 2009 నుంచి 17 ఏళ్లుగా .. తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు 119 – అందులో ఎస్సీ 19, ఎస్టీ 12.ఈ సీట్లు ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 – లోక్సభకు, ఆర్టికల్ 332 – అసెంబ్లీకి. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జనాభా ఎంత శాతం ఉంటే, అంత శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. అదే రాజ్యాంగబద్ధ రిజర్వేషన్. లోక్సభలో ఇది ఎస్సీలకు 15.5%, ఎస్టీలకు 8.6%.
2009 డీలిమిటేషన్ లో ఏం మారింది?
2009 డీలిమిటేషన్ లో ఏం మారింది? చాలా మందికి తెలియని పాయింట్ ఇదే. 2009 కి ముందు, అంటే 1976 డీలిమిటేషన్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 294. అందులో ఎస్సీ 39, ఎస్టీ 15 మాత్రమే.2008 డీలిమిటేషన్ కమిషన్, 2001 జనాభా లెక్కల ఆధారంగా మార్చిన తర్వాత, 2009 ఎన్నికల నాటికి అది ఎస్సీ 48 కి, ఎస్టీ 19 కి పెరిగింది. ఎంపీ సీట్లలో కూడా ఎస్సీ 7, ఎస్టీ 3 గా ఫిక్స్ అయ్యాయి.అంటే డీలిమిటేషన్ వల్ల సీట్ల సంఖ్య పెరగడమే కాదు, చాలా నియోజకవర్గాల రిజర్వేషన్ స్టేటస్ మారిపోయింది. గతంలో జనరల్ గా ఉన్న సీటు ఎస్సీ అయ్యింది. గతంలో ఎస్సీ గా ఉన్న సీటు జనరల్ అయ్యింది. ఉదాహరణకు హాజీపూర్ లాంటి సీట్లు.కానీ సమస్య ఏంటంటే – కొన్ని సీట్లు మాత్రం 1951 నుంచి ఇప్పటివరకు అలాగే రిజర్వ్డ్ గానే ఉండిపోయాయి. అదే కడిపుర్ కేసు జగదీశ్ సింగ్ వాదన ఏంటి?
ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో ఎందుకు రొటేషన్ లేదు?
‘పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అయితే ఆర్టికల్ 243D, 243T ప్రకారం రిజర్వ్ సీట్లు ప్రతిసారీ రొటేషన్ అవుతాయి. ఒకసారి ఎస్సీ, ఇంకోసారి జనరల్. మరి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో ఎందుకు రొటేషన్ లేదు? 70 ఏళ్లుగా ఒకే సీటు రిజర్వ్ లో ఉంచడం ఆర్టికల్ 14, 15, 19 కి వ్యతిరేకం. నా ఓటు హక్కును కుదించినట్టే. ఇది కొన్ని కుటుంబాలకే లాభం చేస్తోంది’ అని అడిగాడు. అలహాబాద్ హైకోర్టు జూన్ 2026 లోనే తిరస్కరించింది. ‘రొటేషన్ ఐడియల్ గా బాగుంటుంది, కానీ కోర్టు చెప్పలేదు’ అని చెప్పింది.నవంబర్ 4, 2026న సుప్రీంకోర్టు, చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని బెంచ్ ఏం చెప్పింది?
బెంచ్ ఏం చెప్పింది?
1. ‘మీరు రాంగ్ నంబర్ డయల్ చేశారు.’ ఇది కోర్టు పని కాదు, పార్లమెంట్ పని.
2. రాజ్యాంగంలోని ఆర్టికల్ 330, 332 లో రొటేషన్ గురించి ఎక్కడా లేదు. డీలిమిటేషన్ చట్టం 2002, సెక్షన్ 9(1)(c) లో కూడా లేదు. ఆ చట్టం కేవలం ‘ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న చోట రిజర్వ్ చేయండి’ అని మాత్రమే చెబుతుంది.
3. ప్రజాస్వామ్యంలో ఓటరు కులాన్ని చూసి కాదు, సిద్ధాంతాన్ని చూసి ఓటు వేయాలి.
4. కావాలంటే మీరు ఎంపీలను కలిసి, నిరసన తెలిపి, పార్లమెంట్ లో చట్టం తెప్పించుకోండి. కోర్టు చట్టాన్ని రాయలేదు.ఒక మాటలో చెప్పాలంటే – పిటిషన్ కొట్టివేత. కానీ చర్చను మాత్రం తెరిచి ఉంచారు.
కడిపుర్ లాంటి సీట్లు రొటేషన్ అవ్వాలా? వద్దా?
సో, అసలు ప్రశ్న ఇది – రిజర్వేషన్ యొక్క ఉద్దేశ్యం ప్రాతినిధ్యం కల్పించడం. అది 70 ఏళ్లుగా ఒకే సీటులో ఉంటే, ప్రాతినిధ్యం కొత్త వాళ్ళకి వస్తుందా? లేక అదే కుటుంబాల చుట్టూ తిరుగుతుందా? మరోవైపు, రొటేషన్ చేస్తే ఎస్సీ, ఎస్టీలకు బలమైన నియోజకవర్గం లేకుండా పోతుందా? ఇది కోర్టు తేల్చే అంశం కాదు, పార్లమెంట్ తేల్చాల్సిన అంశం అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు బంతి పార్లమెంట్ కోర్టులో ఉంది. మీ అభిప్రాయం ఏంటి? కడిపుర్ లాంటి సీట్లు రొటేషన్ అవ్వాలా? వద్దా?
Also Read: నో రేషన్.. నో పెన్షన్? .. ఓటర్ ఐడీ లేకపోతే ప్రభుత్వ సాయం బంద్ కానుందా!