E-Paper
Advertisement

ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్.. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని వారికి మరో ఛాన్స్!

ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్.. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని వారికి మరో ఛాన్స్!
Advertisement

Election Commission of India: ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని పౌరులకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వివరాలను సరిచేసి తుది జాబితాలో చేర్చేందుకు మరొక అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు (ఈసీఓ) శుక్రవారం ఈసీ లేఖ రాసింది.

ఈసీ తాజా ఆదేశాల ప్రకారం.. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేరు రాని వారు తిరిగి ఓటర్లుగా నమోదయ్యేందుకు అవకాశం లభించినట్లైంది. దీని ప్రకారం.. ఒకే నివాసంలో ఉండి ఎన్యుమరేషన్ ఫారమ్స్ సమర్పించలేకపోయిన ఓటర్లు.. తగిన వివరాలతో పాటు ఇంతకుముందు ఎందుకు సమర్పించలేకపోయారో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. మరోవైపు ఒకే రాష్ట్ర పరిధిలో వేరే ప్రాంతానికి మారిన వారు ఫారమ్-8తో సంబంధం లేకుండానే కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు, అడ్రస్ ప్రూఫ్ ను ఎన్యుమరేషన్ ఫారమ్‌తో పాటు ఇస్తే సరిపోతుంది. నిరాశ్రయులు, ఎలాంటి చిరునామా లేని ఓటర్ల విషయంలో బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) నిర్వహించే ఫీల్డ్ వెరిఫికేషన్ నివేదికనే ఈసీ ప్రామాణికంగా తీసుకోనుంది.

Advertisement

మరోవైపు గతంలో ఓటర్లుగా ఉండి డ్రాఫ్ట్ జాబితాలో పేర్లు రాని వారిని గుర్తించి, వారితో బీఎల్ఓల ద్వారా సంప్రదింపులు జరిపేలా చూడాలని ఈసీ తాజా ఉత్తర్వుల్లో రాష్ట్రాల ఎస్ఈసీలకు సూచించింది. వారిని నేరుగా కలవడంతో పాటు వాట్సాప్, ఈమెయిల్, ఎస్ఎమ్‌ఎస్‌ల ద్వారా సమాచారం అందించాలని స్పష్టం చేసింది. డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించబడిన ఓటర్ల వివరాలు, దానికి గల కారణాలను సైతం సీఈఓ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. తుది జాబితాలో చోటు కోసం వచ్చిన దరఖాస్తులను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ERO) క్షుణ్ణంగా పరిశీలించి.. అర్హులకు తుది జాబితాలో చోటు కల్పించాలని దిశానిర్దేశం చేసింది. వారందరికీ పాత ఓటర్ కార్డు నంబర్లే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Also Read: కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

Advertisement

ఇదిలా ఉంటే ఈసీ తాజా ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఓటర్ల తొలగింపులో జరిగిన తప్పులను ఈసీ ఆలస్యంగానైనా ఒప్పుకుందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఇది ఈసీ తీసుకున్న ‘యూ-టర్న్’ అని విమర్శించింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, లేదంటే ప్రభుత్వమే ఆయన్ను పదవి నుంచి తొలగించి వివాదాస్పద ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా, లక్షలాది మంది అర్హులైన పౌరుల ఓట్లను తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రతిచర్యలోనూ ఈసీ గందరగోళం కనిపిస్తోందని కొద్ది రోజులుగా విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి.

Also Read: భూమికి మరో చంద్రుడు.. రహస్యంగా చక్కర్లు కొడుతూ, ఎట్టకేలకు దొరికేశాడు!

Tags

Related News

సీజేఐ సూర్యకాంత్‌పై వివాదాస్పద పోస్ట్.. కేరళ కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు!

‘పేదలు కాలుష్యం చేయరు.. ధనికులే అసలు కారణం’.. ఢిల్లీ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం!

సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!

26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 4 బోగీల్లో ఎగిసిపడిన మంటలు!

ఇది భారత్ లేకుంటే బంగ్లాదేశా? బాబోయ్.. ఈ రష్ ఏంటి? రైల్వేశాఖ ఏం చేస్తోంది?

ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య.. బెంగళూరులో షాకింగ్ ఘటన, ఏడేళ్ల బాలుడితోపాటు..

Big Stories

Advertisement
×