E-Paper
Advertisement

శ్రీశ్రీకి సిగరెట్ కొనిచ్చిన దర్శకుడు.. అసలు కథ ఇదే!

శ్రీశ్రీకి సిగరెట్ కొనిచ్చిన దర్శకుడు.. అసలు కథ ఇదే!
Advertisement

Siva Nageswara Rao:సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి జరిగే చిన్న చిన్న సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పక్కర్లేదు.ఇదిగో తాజాగా అలాంటి మరచిపోలేని ఒక సంఘటనని ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు బయటపెట్టారుఆచార్య ఆత్రేయ, మహాకవి శ్రీశ్రీ, సామవేదం షణ్ముఖ శర్మతో తనకు ఎదురైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.

ఆత్రేయ దగ్గరకు ఉద్యోగం కోసం వెళ్తే ఏం జరిగిందంటే?

Advertisement

తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలని అనుకున్న సమయంలో మద్రాస్ వెళ్లి ఆచార్య ఆత్రేయను కలిసినట్లు చెప్పారు. వెళ్లి తన పేరు చెప్పిన తర్వాత ఆత్రేయ ఆయన ఇంటిపేరు అడిగగా తాను ఇంటిపేరు నాగండ్ల అని చెప్పడంతో పాటు, తనకు తెలిసిన హైకోర్టు లాయర్ శ్రీనివాసరావు గురించి కూడా చెప్పారట.అయితే ఆ పరిచయాల ద్వారా ఆత్రేయకు కావాల్సిన లింక్ కుదరకపోవడంతో ప్రస్తుతం తన దగ్గర ఖాళీలు లేవని చెప్పారట. మళ్లీ సినిమా తీసేటప్పుడు ఖాళీ ఉంటే కలవమని చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేశానని గుర్తుచేసుకున్నారు.

పాటలో వేలు పెడితే ఆత్రేయకు కోపం వచ్చేది!

Advertisement

‘జగన్నాథ రథచక్రాలు’ సినిమాకు ఆత్రేయ పాటలు రాసిన సమయంలో శివ నాగేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని,ఆ సమయంలో ఆత్రేయ తనను చాలా ఆప్యాయంగా చూసుకునేవారని చెప్పారు. రోజూ రెండు పెగ్గుల బ్రాందీ తాగేవారని, తనను కూడా తాగమని సరదాగా అడిగేవారని తెలిపారు.

అంతేకాదు, ఆయన పాట గురించి ఆలోచిస్తూ పడుకున్నప్పుడు నిద్రపోయారని అనిపిస్తే శివ నాగేశ్వరరావు పెన్ను లేదా స్పూన్ కింద పడేసి శబ్దం చేసేవారట. వెంటనే లేచి ‘దుర్మార్గుడా.. పాట గురించే ఆలోచిస్తున్నా’ అంటూ సరదాగా తిట్టేవారట.

మరోసారి పాటలో ఒక పదం విషయంలో చక్రవర్తి, ఆత్రేయ మాట్లాడుకుంటుండగా శివ నాగేశ్వరరావు మెల్లగా ‘మల్లెలు’ అనే పదం సూచించారట. అంతే ఆత్రేయకు కోపం వచ్చి తన సాహిత్యంలో వేలు పెట్టొద్దంటూ గట్టిగా తిట్టేశారట. తన పాట విషయంలో ఆత్రేయ ఎంత పట్టుదలగా ఉండేవారో ఈ ఒక్క ఇన్సిడెంట్ తో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు శివ నాగేశ్వరరావు

మహాకవి శ్రీశ్రీకి సిగరెట్ కొనిచ్చిన సందర్భం!

ఇక మహాకవి శ్రీశ్రీతో జరిగిన సంఘటన గురించి చెబుతూ ‘మరో కురుక్షేత్రం’ సినిమా సమయంలో ఓ రోజు సాయంత్రం ఆఫీసులో ఒక్కడే ఉన్నారట. అదే సమయంలో శ్రీశ్రీ ఆటోలో అక్కడికి వచ్చి నిర్మాత ఉన్నారా అని అడిగారట.నిర్మాత లేరని చెప్పడంతో ఒక చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ తెప్పించగలవా అని అడిగడంతో వెంటనే శివ నాగేశ్వరరావు తన సొంత డబ్బులతో సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చి ఇచ్చారట.

అది తీసుకున్న శ్రీశ్రీ థాంక్స్ చెప్పి, నిర్మాతకు తాను వచ్చినట్లు చెప్పమన్నారట. ఆ తర్వాత రెండు అడుగులు ముందుకు వేసి ‘నేను ఎవరో తెలుసా?’ అని అడిగారట. శ్రీశ్రీ గారని చెప్పడంతో గుర్తుపట్టావు కదా సంతోషం అంటూ మాట్లాడారట.

అలా ఈ ఇన్సిడెంట్ గుర్తుచేసుకుంటూ శ్రీశ్రీ తన దగ్గర ఒక చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ బాకీ పడ్డారని సరదాగా చెప్పారు. అప్పట్లో పాటలు రాసిన వారికి డబ్బులు కూడా వెంటనే అందేవి కాదని, చెక్కు లేదా క్యాష్ తీసుకోవడానికి స్వయంగా వెళ్లాల్సి వచ్చేదని ఆనాటి రోజులని గుర్తుచేసుకున్నారు శివ నాగేశ్వరరావు.

ALSO READ :రక్తం మరకలతో కమల్ హాసన్ పవర్‌ఫుల్ లుక్.. సండియర్‌గా మరో సంచలనం!

Tags

Related News

తేజ సజ్జ నిశ్చితార్థం.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం!

రక్తం మరకలతో కమల్ హాసన్ పవర్‌ఫుల్ లుక్.. సండియర్‌గా మరో సంచలనం!

పింక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న అమీర్ ఖాన్ మేనకోడలు.. ఫోటోలు వైరల్!

అలీ షూటింగ్‌లతో బిజీ.. నేను ఆసుపత్రిలో ఒంటరిగా.. జుబేదా ఆవేదన!

రూమర్లకు చెక్.. పండగకే రాబోతున్న ‘కాకా’ .. డైరెక్టర్ క్లారిటీ!

బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘దాదా’ పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

మొదట్లో జోరు..ఇప్పుడు బేజారు!.ఆదర్శకుటుంబం ఇక అంతేనా?

Big Stories

Advertisement
×