Pawan Kalyan :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2023లో ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో మొదలుపెట్టిన చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. ఇమ్రాన్ హస్మి, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ షాట్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదల చేశారు. దాంతో అప్పట్నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు మేకర్స్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మళ్ళీ తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు డేట్స్ ఇవ్వడంలో కాస్త ఆలస్యం చేశారనే చెప్పాలి.
మళ్లీ వాయిదా పడ్డ హరిహర వీరమల్లు..
దీనికి తోడు జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మరో 20 రోజులు డేట్స్ కేటాయిస్తే..సినిమా విడుదలవుతుంది. అలా మే 9వ తేదీన సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా.. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన ఈ సినిమా మే 9న విడుదల చేయడం అసాధ్యమని, మే 30వ తేదీన సాధ్యమైనంత వరకు రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపించాయి. ఒకవేళ ఇదే నిజమైతే హరిహర వీరమల్లు సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్.. అనుకున్న టైం కి సినిమా విడుదల చేయకపోతే ఓటీటీ హక్కులను క్యాన్సిల్ చేసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఓజీ షూటింగ్ కి సర్వం సిద్ధం.. పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం..
ఇక ఈ సినిమా విడుదలవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఓజీ సినిమాను మాత్రం పక్కాగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చిత్ర బృందం ఎదురుచూస్తోందని, అటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా సెప్టెంబర్ లో విడుదల చేస్తామని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే షూటింగ్ చేయడానికి మేకర్స్ అంతా సిద్ధం చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యమని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఇటు ఓజికి డేట్ ఇస్తారా? అటు హరిహర వీరమల్లు సినిమాకి తన డేట్స్ కేటాయిస్తారా ?అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఏకంగా రెండు చిత్ర బృందాల మేకర్స్ ఎదురుచూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ మొదట ఏ సినిమాకు డేట్ ఇచ్చి ప్రేక్షకులు ముందుకు వస్తారో చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంకొక వైపు కుటుంబాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే గిరిజన గ్రామాలలో కూడా పర్యటనలు చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకొని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా ఆయన అభిమానులను మెప్పించడానికి తన డేట్స్ కేటాయిస్తారో చూడాలి.