Samantha: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఒకప్పుడు సమంత పేరు వినిపించేది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చిన సమంత అందరి మనసులో జెస్సీగా ఒక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలతో కూడా సినిమాను చేసింది. రామ్ చరణ్ సరసన నటించిన రంగస్థలం సినిమా సమంత కెరీర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఇక కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా, లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టింది. సమంతకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
కెరీయర్ మలుపు
ఒక సమంత వ్యక్తిగత విషయానికొస్తే తాను కలిసిన నటించిన నాగచైతన్యతో మంచి స్నేహబంధం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమకు దారి తీసి ఇద్దరు కలిసి ఏడు అడుగులు కూడా వేశారు. అయితే వాళ్లకు ఉన్న వ్యక్తిగత కారణాలవల్ల వాళ్ళు విడిపోవడం జరిగింది. ఇద్దరూ పరస్పర ఇష్టంతోనే విడిపోయారు. ఆ తరుణంలో సమంత చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. అంతేకాకుండా సమంత అప్పట్లో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా తెలిపారు. ఆ తరుణంలోని మరోవైపు సినిమాలు కూడా చేశారు. ఇక నాకు చైతన్య ప్రస్తుతం సినిమాలు చేస్తూ మరో పెళ్లి కూడా చేసుకున్నారు.
Also Read : SSMB29 : మహేష్ బాబు, పృధ్విరాజ్ సుకుమారన్ మధ్య కీలక సీన్స్, షూటింగ్ ఎక్కడంటే.?
అదే కారణమా.?
ఇక రీసెంట్ గా సమంతా రూత్ ప్రభు ఇన్‌స్టాగ్రామ్‌లో పురుషులు ‘తమ అనారోగ్య భాగస్వాములను వదిలివేస్తున్నారు’ అనే పోస్ట్‌ను లైక్ చేశారు. ఆ పోస్ట్‌లో పురుషులు ‘సంబంధాలను విడిచిపెట్టడం’ అనే అంశం ఉంది. పురుషులు ‘జీవిత భాగస్వామికి తీవ్ర అనారోగ్యం కలిగితే ఆమెను వదిలివేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అయితే స్త్రీలు తమ అనారోగ్య జీవిత భాగస్వాములను అక్కడే ఉంచి వారిని చూసుకుంటారు’ అనే చర్చను ఇది నిర్వహించింది. 2022లో, సమంత తాను మైయోసిటిస్‌తో పోరాడుతున్నట్లు వెల్లడించింది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి సమంతా కి మైయోసిటిస్ ఉండటమే ఒక కారణమా అని కొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం ఎవరి కెరియర్ తో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు.ఇక సమంత కేవలం తెలుగు మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే సినిమాలను ప్రజెంట్ చేసే పనిలో కూడా పడ్డారు సమంత. ప్రస్తుతం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న శుభం సినిమాను సమంత ప్రజెంట్ చేస్తున్నారు.
Also Read : Akhanda 2 : బాలకృష్ణ అఖండ 2 షూటింగ్ అప్డేట్… ఇప్పుడు షూటింగ్ ఎక్కడంటే..?