JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టారు. ఆయనతోపాటు భార్య ఉషా వాన్స్ కూడా వచ్చారు. సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన సమావేశం కానున్నారు. అమెరికా-భారత్ లకు సంబంధించి వాణిజ్యం,ప్రాంతీయ భద్రత, పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే ఫస్ట్ టైమ్. వాన్స్ వెంట భార్య, ముగ్గురు పిల్లలు ఆ దేశ ప్రతినిధులు ఉన్నారు. అందులో రక్షణ శాఖ, విదేశాంగశాఖ అధికారులు ఉన్నారు. ఎయిర్‌పోర్టులో వాన్స్‌కు సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి.
జేడీ వాన్స్ టూర్ షెడ్యూల్
సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వాన్స్ దంపతులకు తన నివాసంలో ప్రధాని స్వాగతం పలుకుతారు. ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. విందు తర్వాత రాత్రికి వాన్స్ దంపతులు జైపూర్ వెళ్లనున్నారు.
ఢిల్లీ టు జైపూర్
విలాసవంతమైన రాంభాగ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం అక్కడ పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనుంది వాన్స్ ఫ్యామిలీ. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆయన ప్రసంగిస్తారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికా సంబంధాల గురించి మాట్లాడనున్నారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, ఇండియా అధికారులు, విద్యావేత్తలు హాజరుకానున్నారు.
ALSO READ: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది మావోలు హతం
జైపూర్ టు అమెరికా
23న వాన్స్ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్‌మహల్, శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ జైపూర్‌కు వెళ్తారు. 24న అక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్లనున్నారు. ప్రధాని మోదీ-అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. భేటీ తర్వాత వాన్స్ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు.
భారత్ నుంచి వెళ్లిన విద్యార్థుల అంశంపైనా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఉషా వాన్స్ పూర్వీకులు సొంతూరు విజయవాడ. ఈ టూర్ లో ఆమె కచ్చితంగా విజయవాడకు వస్తారని చాలామంది భావించారు. కాకపోతే షెడ్యూల్ ముందుగా ఫిక్స్ కావడం రాలేకపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..
పాలెం ఎయిర్ పోర్టులో జేడీ వాన్స్ దంపతులకు ఘన స్వాగతం
త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించిన అమెరికా ఉపాధ్యక్షుడు
సా.6.30 గంటలకు ప్రధాని మోదీతో వాన్స్ సమావేశం
అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ కు జేడీ వాన్… pic.twitter.com/gh50drgxt4
— BIG TV Breaking News (@bigtvtelugu) April 21, 2025