Game Changer pre release event : మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత సోలోగా వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. శంకర్ సినిమాలు అంటే భారీ అంచనాలే ఉంటాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ పై అంతకు మించి ఉన్నాయి.. భారీ బడ్జెట్ తో పొలిటికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ అవుతున్నాయి.. నిన్న విడుదలైన ట్రైలర్ సినిమాకు ఏ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసిందో చూశాం.. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ 38 మిలియన్ వ్యూస్ ను అందుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమండ్రిలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్రయూనిట్ తో పాటుగా ముఖ్య అతిధిగా ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ హాజరైయారు.. ఆయన అద్భుతమైన స్పీచ్ తో అందరిని ఆకట్టుకుంది.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా 10 న రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.. మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రెండు లక్షలకు పైగా అభిమానులు హాజరైనట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడిందట. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న సినిమా ఈవెంట్ కావడంతో ఈ రేంజ్ డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు విశ్లేషకులు.. ఏడేళ్ల తర్వాత వీరిద్దరినీ ఒకే స్టేజ్ పై చూడటానికి ఫ్యాన్స్ కూడా ఈవెంట్ కు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అని యావత్ ప్రజలు ఎదురు చూశారు. ఇంతకీ రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారంటే..
ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ పై, అలాగే గేమ్ ఛేంజర్ యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. ఇక రామ్ చరణ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. రామ్ చరణ్ కు ఆ పేరు ఎందుకు పెట్టారో అన్న దగ్గర నుంచి చరణ్ క్రమశిక్షణ గురించి అందరికి చెప్పాడు. ఇక గ్లోబల్ స్టార్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అతని శ్రద్ద, క్రమం శిక్షణే ఆ స్థాయికి తీసుకెళ్లిందని అబ్బాయిని పొగడ్తలతో ముంచేసాడు. ఇక తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడని పవన్ అనగానే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. బాబాయి నోటా చరణ్ పై ప్రశంసలు అని సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. పవన్ కళ్యాణ్ స్పీచ్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పాలి.. మరి గేమ్ ఛేంజర్ మూవీ గ్లోబల్ స్టార్ కు ఏ మాత్రం హిట్ టాక్ ను అందిస్తుందో జనవరి 10 న చూడాలి..