Children Safety : సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో పిల్లలు ప్రమాదంలో పడుతున్నారనే చెప్పాలి. ఇంకా ముఖ్యంగా టీనేజర్స్ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ పెను ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల డేటాను సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న టీనేజర్స్ గోప్యతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదాను తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను సృష్టించేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అంటూ తెలిపింది. ఇక ఈ నిబంధనలపై ఎవరైనా సంప్రదింపులు జరపాలంటే ఫిబ్రవరి 18 వరకు గడువు ఇచ్చింది.
నిజానికి నేటి డిజిటల్ యుగంలో పిల్లలు ఒకప్పటి కంటే ఎక్కువగా సోషల్ మీడియాకు కనెక్ట్ అయ్యారని చెప్పాలి. దీంతో ప్రమాదాలు సైతం అదే స్థాయిలో ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎందరో అభం శుభం తెలియని పిల్లలు సోషల్ మీడియాలో ఎదురయ్యే పరిస్థితులని తట్టుకోలేక ఆత్మహత్యల సైతం చేసుకుంటున్నారు. దీంతో టీనేజర్స్ గోప్యతను మరింత కాపాడేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానం టీనేజర్స్ ను ప్రమాదాల నుంచి కాపాడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముసాయిదా నిబంధనలు ఏం చెబుతున్నాయి –
ముసాయిదాలో “డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023లోని సెక్షన్ 40లోని సబ్-సెక్షన్లు (1), (2)తో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నియమాలు బట్టి సోషల్ మీడియాకి ఎక్కువగా ప్రభావితం అయ్యే వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా నియమాలు, డేటా ఉల్లంఘనలకు పరిష్కారం లభిస్తుంది. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తే కలిగే పర్యవసనాలు, వాటి నుంచి ఉపశమనం చర్యలు గురించి బాధితులకు తెలియజేస్తుంది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది.
అయితే ఈ ముసాయిదా నిబంధనలపై పబ్లిక్ సంప్రదింపులు ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతాయని కేంద్రం తెలిపింది. ఆ తర్వాత అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్రభుత్వం తగిన నిబంధనలు ఫైనల్ చేస్తుందని తెలుస్తోంది. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సంబంధించిన MyGov.in ప్లాట్‌ఫారమ్‌లో ముసాయిదా నిబంధనలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలను తెలపటానికి అవకాశం ఇచ్చింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు యువత సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 18 ఏళ్లలోపు పిల్లలు ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు అలవాటు పడి ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే 18 ఏళ్లలో పిల్లలు ఇంస్టాగ్రామ్ ను ఉపయోగించాలంటే వారి కోసం ప్రత్యేకంగా టీన్ అకౌంట్ ను సైతం క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా సైతం టీనేజర్స్ కు సోషల్ మీడియాను నిషేధించింది. ఇప్పుడు ఇండియాలో సైతం ఈ నిబంధనలు రావడంతో ముందు ముందు ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తుంది ప్రభుత్వం.
ALSO READ : మీ ఖాతాలోకి పొరపాటు డబ్బులు పంపామని ఫోన్ చేస్తారు.. ఆపై!