Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – అన్నా లెజ్నోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) నిన్న సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అవ్వడమే కాకుండా మంటల వల్ల ఏర్పడిన పొగ.. బాలుడి ఊపిరితిత్తులకు చేరడంతో.. ఊపిరి తీసుకోవడంలో మార్క్ శంకర్ ఇబ్బంది పడ్డారట. దీంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించగా ప్రస్తుతం ఐసీయూలో ఉంచినట్లు సమాచారం. ఇకపోతే మార్క్ శంకర్ కి ఈ ప్రమాదంలో గాయాలు అయ్యాయి అని తెలిసిన పవన్ కళ్యాణ్.. ఒకవైపు అడవి బిడ్డలతో పర్యటన నిర్వహించాల్సి ఉండగా.. అరకులో పర్యటన పూర్తి చేసిన వెంటనే విశాఖ చేరుకుని.. అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్లి.. అటు నుంచి సింగపూర్ వెళ్లిపోయారు.
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి.. వైద్యులు ఏమన్నారంటే..
ఇక సింగపూర్ నుండి మార్క్ శంకర్ చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్ కి నేరుగా చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు , కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన చిన్న కొడుకు ఆరోగ్యం పై అక్కడి వైద్యులు , అధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. మార్క్ కోలుకుంటున్నాడని, కానీ ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్య బృందం తెలియజేశారు.
Upasana: తొలిసారి వైవాహిక బంధంపై స్పందించిన మెగా కోడలు.. పూల పాన్పు కాదంటూ..?
3 రోజులపాటు వైద్య పర్యవేక్షణలో మార్క్ శంకర్..
ఇక భారత కాలమానం ప్రకారం బుధవారం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకు వచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్య పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు కూడా తెలియజేశారు. ఇకపోతే మార్క్ శంకర్ కి గాయాలయ్యాయి అని తెలిసి, ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , మాజీ మంత్రి రోజాతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఇకపోతే ప్రస్తుతం మార్కు శంకరును చూడడానికి చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ కొణిదెల కూడా శంషాబాద్ నుండి సింగపూర్ వెళ్లారు.