Siddu on Jack Film: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ప్రేక్షకుల్ని పలకరించడానికి మరో కొత్త మూవీతో రానున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న సినిమా జాక్. ఏప్రిల్10వ తేదీన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా హీరో గంగవ్వతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రముఖ టీవీ షో బిగ్ బాస్ తో ఫేమస్ అయిన గంగవ్వ సినిమాలు, ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా గంగవ్వ జాక్ మూవీ కోసం పోడ్ కాస్ట్ నిర్వహించారు. అందులో భాగంగా గంగవ్వ అడిగే ప్రశ్నలకు సిద్దు సరదాగా సమాధానాలు ఇచ్చాడు. గంగవ్వ తో సిద్దు జాక్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సిద్దు అసలేం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
Also read: Mangalavaram 2 : హర్రర్ తో పాటు మరో ప్రయోగం… ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
గంగవ్వ తో సరదా చిట్ చాట్ ..
గంగవ్వ నువ్వు ఎన్ని సినిమాలు తీసావు అని సిద్దుతో అంటుంది. అసలు మీరు హాయ్ అని ఏమీ చెప్పకుండానే నన్ను ప్రశ్నలు వేస్తున్నారా.. సరే నేను రెండు సినిమాలు తీశాను అని, ఇప్పుడు వస్తున్న సినిమ పేరు జాక్ అని అంటాడు. జాక్ అంటే ఏంటి అని అంటుంది గంగవ్వ. నీకు నాకు పేరు ఎలా ఉందో అలానే జాక్ అనేది కూడా ఇంగ్లీష్ పేరు అని సిద్దు చెప్తాడు. డీజే టిల్లు లాగా ఈ సినిమాలో కూడా మీరు నవ్విస్తారా అని గంగవ్వ అడిగిన ప్రశ్నకు.. సిద్దు నవ్విస్తాము కానీ, డీజే టిల్లు అంత బాగా ఇందులో నవ్వించకపోవచ్చు. ఆ సినిమా లాగా ఈ సినిమా ఉండదు. ఎందుకంటే అది కామెడీ సినిమా. ఈ సినిమాలో నవ్విస్తాం కానీ, ఫుల్ కామెడీ సినిమా కాదు. దీనికి ఎంత నవ్వాలో అంత నవ్వుతారు. జాక్ సినిమాలో అంత లేదు కానీ, నవ్విస్తాము అని కొత్త సినిమాపై ఓపెన్ గా నిజం చెప్పాడు సిద్దు. ఈ వీడియో చూసిన వారంతా సిద్దు చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
అమ్మాయి లేకపోతే సినిమా లేదు ..
టిల్లు సినిమాలో అమ్మాయిల వెంట పడతావు కదా.. ఈ సినిమాలో ఆలా వుంటుందా అని గంగవ్వ అడగ్గానే.. సిద్దు గంగవ్వతో.. అమ్మాయిలు వెంట పడకపోతే అది యూత్ సినిమా ఎలా అవుతుంది. అలాంటిది ఈ సినిమాలో కూడా ఉంటాయి. వైష్ణవి మా సినిమా హీరోయిన్, తను చాల బాగా చేసింది. యూత్ సినిమాకి రావాలి అంటే అమ్మాయిలు వుండాలిసిందే, మా సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదలవుతుంది. నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి సినిమాని ప్రేమోట్ చేయాలి. టికెట్స్ నేనే పంపిస్తాను. మీరందరూ సినిమా చూడాలి. వచ్చేది వేసవికాలం బయట వేడికి తట్టుకోలేక చల్లగా థియేటర్లోకి వెళ్లి కూర్చొని సినిమా చూడండి అని సిద్దు సరదాగా గంగవ్వతో ముచ్చటించాడు.