BigTV English

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినీ స్టార్ల శుభాకాంక్షలు.. సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినీ స్టార్ల శుభాకాంక్షలు.. సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం

Pawan Kalyan: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన (టీడీపీ+జనసేన+బీజేపీ) పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. అయితే ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ ఓట్లతో అధికారికంగా గెలుపొందారు. దీంతో పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


అందులో నటుడు మాస్ మహారాజా, నితిన్, నేచురల్ స్టార్ నాని వంటి హీరోలు పవన్‌ విజయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగానే రవితేజ ‘‘బిగ్ కంగ్రాట్యులేషన్స్ పవన్ కల్యాణ్ గారు. పిఠాపురం నియోజకవర్గంలో భారీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. ఈ ప్రయాణంలో మీ పట్టుదలకు వందనాలు. మీరు మీ పెద్ద మనసుతో ప్రజలకు సేవ చేస్తూ అందరికీ స్పూర్తిగా నిలవాలి’’ అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు.

రవితేజతో పాటు హీరో నితిన్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘డియరెస్ట్ పవన్ కల్యాణ్ గారు.. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మీ చరిత్ర, మీరు కూటమిని అగ్రస్థానానికి చేర్చిన తీరు పట్ల అభిమానిగా.. సోదరుడిగా నేను చాలా థ్రిల్‌గా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఫీలౌవుతున్నాను. కానీ మీరు పోరాడిన తీరు.. అద్భుతమైన విజయానికి అర్హమైనది’’ అంటూ రాసుకొచ్చారు.

ఈ ఇద్దరి హీరోలతో పాటు మరో హీరో నేచురల్ స్టార్ నాని కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పవన్ కల్యాణ్‌కు కాంగ్రాట్స్ తెలిపారు. ‘‘ఆన్/ఆఫ్ స్క్రీన్ హీరో పవన్ కల్యాణ్‌ గారికి అభినందనలు. మిమ్మల్ని అనుమానించిన తీరు, పోరాడిన తీరు, గెలిచిన తీరు చెప్పడానికి కథ మాత్రమే కాదు.. నేర్చుకోవాల్సిన ఒక పాఠం. మీ గురించి ఆలోచిస్తుంటే చాలా గర్వంగా ఉంది సర్. మీరు పెద్ద ఎత్తుకు చేరుకుంటారని.. మీరు చేసే పనితో ఒక ఉదాహరణగా నిలుస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు.

ఇక వీరితో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తనవంతుగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏపీ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు మన జనసేనానికి అభినందనలు!. మీ దృఢత్వం, కృషి, నమ్మకం అన్నింటికంటే ఎక్కువగా నిలిచాయి. ఈ రాజకీయ ప్రయాణంలో మీకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్‌కు మీరు తీసుకువచ్చే ప్రగతి, శ్రేయస్సు కోసం ఎదురు చూస్తున్నాను!’’ అంటూ పేర్కొన్నారు. వీరితో పాటు మరెందరో సినీ సెలబ్రిటీలు తమవంతుగా కంగ్రాట్స్ తెలుపుతున్నార.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×