BigTV English

Pawan Kalyan Family Pic: పిక్ ఆఫ్ ది డే.. భార్యాపిల్లలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. చూడడానికి రెండు కళ్లు చాలట్లేదే!

Pawan Kalyan Family Pic: పిక్ ఆఫ్ ది డే.. భార్యాపిల్లలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. చూడడానికి రెండు కళ్లు చాలట్లేదే!

AP Deputy CM Pawan Kalyan Family Pic Got Viral: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే ప్రజల సేవలో పడిపోయారు. నిత్యం ఫైల్స్, ప్రజల కష్టాలను వింటూ ఆ సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నారు. ఇక పవన్.. ఎప్పుడు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల సమయం నుంచే అకీరా.. పవన్ తో పాటే ఉంటున్నాడు.


ఇక పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. పవన్ కు దూరమైనా.. పిల్లలను తండ్రికి ఎప్పుడు దగ్గరగా ఉంచుతుంది. పవన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున.. రేణు పిల్లలు అకీరా, ఆద్య కూడా వచ్చారు. అయితే వీరితో ఎప్పుడు పవన్ కలిసి కనిపించలేదు. అకీరా ఉంటే .. ఆద్య ఉండదు. ఆద్య ఉంటే అకీరా మిస్ అవుతున్నాడు. ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు.. తండ్రితో ఉన్న ఫోటో చాలా రేర్ అని చెప్పాలి.

ఇక తాజగా ఆ లోటు తీరిపోయింది. ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు తండ్రితో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది.


Also Read: Samantha: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో సమంత.. నిజమేనా ?

ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే – ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది” అంటూ జనసేన తమ ట్విట్టర్ హ్యాండిల్ లో అధికారికంగా ఈ ఫోటోను షేర్ చేసింది.

పవన్ పక్కన అనా.. ఆమె పక్కన అకీరా.. ఇటు పక్కన ఆద్య.. వారిపై చేతులు వేసి పవన్ ఫోటోలకు పోజ్ ఇచ్చారు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు భార్యాపిల్లలతో డిప్యూటీ సీఎం గారు.. చూడడానికి రెండు కళ్లు చాలడం లేదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×