Pawan Kalyan – Vijay: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చాలాకాలం తర్వాత హరిహర వీరమల్లు (Harihara Veeramallu)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈయన చివరిగా బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ ఎంతో బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు పూర్తిగా సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఈయన కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులు కూడా చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి . పవన్ కళ్యాణ్ కు వీలైనప్పుడల్లా సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.
బాక్సాఫీస్ వార్…
ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయింది. నిజానికి ఈ సినిమా జూన్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఎడిటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 25వ తేదీ విడుదల కాబోతుందని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే అదే రోజే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్ డం (King Dom)సినిమాని విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతున్నాయనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్..
నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలా వరకు ఇతర హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటారు కానీ విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమా వాయిదా వేయలేని పరిస్థితిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఆధారంగా విడుదల తేదీలను ప్రకటించాయని తెలుస్తోంది. వీరమల్లు సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)కొనుగోలు చేయడమే కాకుండా స్ట్రీమింగ్ తేదీని కూడ లాక్ చేశారు. అదేవిధంగా కింగ్ డం సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ (Net Flixs)కూడా స్ట్రీమింగ్ డేట్ లాక్ చేశారు.
మాట నిలబెట్టుకుంటారా…
ఇలా ఈ రెండు సినిమాల విషయంలో ఓటీటీ సంస్థలు లాక్ చేసిన స్ట్రీమింగ్ డేటు కనుక వాయిదా వేస్తే డీల్ ప్రకారం ఇవ్వాల్సిన ప్రైజ్ కంటే చాలా తక్కువగా ఇవ్వాల్సి వస్తుందని మేనేజ్మెంట్ వారు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీగా నిలవబోతున్నాయని తెలుస్తోంది. ఇలా ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తే కచ్చితంగా వీరి అభిమానుల మధ్య కూడా సోషల్ మీడియా వారికి నడుస్తుందని చెప్పాలి. అయితే గతంలో కింగ్ డమ్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Naga Vamshi)పవన్ కళ్యాణ్ సినిమాకు తాము ఎక్కడ అడ్డురామని ఒకవేళ మేము విడుదల చేసే తేదీ పవన్ సినిమా వస్తే తప్పకుండా మేము వెనక్కి వెళ్తామని చెప్పారు. మరి ఇప్పుడు నాగ వంశీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇచ్చిన మాట మీద నిలబడతారా? లేదా మాట తప్పుతారా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Prabhas: రాజా సాబ్ టీజర్.. అసంతృప్తిలో ప్రభాస్.. ఇలా షాక్ ఇచ్చావేంటీ డార్లింగ్!