BigTV English

Hi Nanna Pre Release Event : హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ సెలబ్రిటీల పర్సనల్ పిక్.. షాక్ అయిన మృణాల్..

Hi Nanna Pre Release Event : హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ సెలబ్రిటీల పర్సనల్ పిక్.. షాక్ అయిన మృణాల్..
Hi Nanna Pre Release Event

Hi Nanna Pre Release Event : నాని..మృణాల్ కాంబోలో వస్తున్న ఎమోషనల్ రొమాంటిక్ మూవీ హాయ్ నాన్న. డిసెంబర్ 7 న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీకి ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. హీరో నాని కూడా ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ను చాలా వినూత్నంగా ముందుకు తీసుకు వెళ్తున్నాడు.ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో, హీరోయిన్లు బాగా సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ లో జరిగిన ఒక చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధం.. హీరో, హీరోయిన్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. మంచి ఇంట్రెస్టింగ్ అంశాలతో సాగే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ స్టోరీ పై ఆసక్తిని కలిగిస్తుంది. నాని కూతురు పాత్ర బేబి కియారా ఖన్నా పోషిస్తుంది. నాని మొదటి భార్య క్యారెక్టర్ వర్ష గా శృతిహాసన్ చిన్న క్యామియో రోల్ లో కనిపించనుంది అన్న విషయం ట్రైలర్ లో స్పష్టంగా అర్థమైంది.

ఇక నిన్న ఈ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. హాయ్ నాన్న మూవీకి సంబంధించిన ఈవెంట్ లో ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే.. మృణాల్ తో ఫోటో తీసుకున్న సుమ.. మా ఫోటోగ్రాఫర్ కొన్ని ఫోటోలు తీశాడు వాటికి మీరు కామెంట్లు పెట్టాలి అంటూ ఓ చిన్న గేమ్ స్టార్ట్ చేసింది. గేమ్ లో భాగంగా మొదట నాని సెల్ఫీ ఒకటి డిస్ప్లే అయింది.. దీనికి మృణాల్ ఫ్రెష్ హెయిర్ కట్ అనే కామెంట్ పాస్ చేయడంతో అందరూ నవ్వారు. ఆ తరువాత నాని, అంటే సుందరానికి హీరోయిన్ తో ఉన్న ఫోటో డిస్ప్లే అయింది.. దీనికి కూడా మృణాల్ ఫన్నీగా అంటే నజ్రియాకు అంటూ కామెంట్ చేసింది.


ఆ తర్వాత వచ్చిన దుల్కర్ ఫోటో కి.. వాట్ ఇస్ ది జోక్ దుల్కర్.. అని కామెంట్ పాస్ చేసింది మన సీత. ఇంతవరకు అంతా బాగానే జరిగింది ఇక లాస్ట్ పిక్ అంటూ సుమ అన్న తర్వాత స్క్రీన్ పై డిస్ప్లే అయిన పిక్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఆ పిక్ ఏమిటంటే.. అప్పట్లో విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఫోజిస్తూ దిగిన ఒక ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. తర్వాత కాసేపటికి రష్మిక కూడా ఇంస్టాగ్రామ్ నుంచే తను స్విమ్మింగ్ పూల్ లో ఉన్న మరొక ఫోటోని షేర్ చేసింది. దీంతో అప్పట్లో ఈ రెండు ఫోటోలు కలిపి వీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారు అన్న ప్రచారం జోరుగా జరిగింది. ఇప్పుడు తిరిగి నాని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ స్క్రీన్ పై ఆ ఫోటోని చూపించిన సుమ దానికి మృణాల్ ను కామెంట్ ఏమిటి అని అడిగింది.

మొదట ఏం చెప్పాలో అర్థం కాని మృణాల్ కాస్త ఇబ్బంది పడింది.. ఇక ఆ తర్వాత సుమ అరేయ్ ఎవర్రా ఫోటో పెట్టింది ..మొన్న మాల్దీవ్స్ కి వెళ్ళింది నువ్వేనా ..సెలబ్రిటీ ఫోటో అయితే పెట్టేస్తావా.. పర్సనల్ స్పేస్ ఉండదా అంటూ ..కెమెరామెన్ మీద కాసేపు అరిచినట్టు ఓవరాక్షన్ చేసింది. ఏదో ఒక కామెంట్ ఇచ్చేస్తే ఇక ఆ ఫోటో తీసేస్తాను అని సుమ అనడంతో మృణాల్.. వెకేషన్ మోడ్ ఆన్.. అని అంది. అంతవరకు బాగానే ఉంది కానీ ఇలా వేరొకరి పర్సనల్ ఫోటోలు ఈవెంట్లో డిస్ప్లే చేయడం ఎంతవరకు సబబు అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై విజయ్ దేవరకొండ ,రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×