E-Paper
Advertisement

Politicians Votes: ఓటేసిన రాజకీయ నేతలు.. కొడంగల్ లో ఓటువేసిన రేవంత్

Politicians Votes: ఓటేసిన రాజకీయ నేతలు.. కొడంగల్ లో ఓటువేసిన రేవంత్

Politicians Votes: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) పోలింగ్ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,665 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో మండలం పోలింగ్ బూత్ లో తుమ్మల నాగేశ్వర రావు ఓటు వేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి నారాయణపురంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య ఓటు వేశారు.పువ్వాడ అజయ్‌, చల్లా ధర్మారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి ఓటు వేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ పర్వతగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్‌లో వినోద్‌ కుమార్‌, వివేక్‌ వెంకటస్వామి మంచిర్యాలలో ఓటు వేశారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కల్వకుంట్ల కవిత ఓటు వేశారు. బర్కత్‌పురలో కిషన్‌రెడ్డి, అంబర్‌పేట్‌లో డీజీపీ అంజనీకుమార్‌,శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు, పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బోయిన్‌పల్లిలో మల్లారెడ్డి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి సంగారెడ్డి నారాయణఖేడ్‌లో తమ ఓటు వేశారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కౌడిపల్లి పోలింగ్ బూత్ లో, గజ్వేల్‌లో తూంకుంట నర్సారెడ్డి ఓటు వేశారు. సిద్దిపేట బొప్పాపూర్‌లో రఘునందన్‌రావు, మెదక్‌ కోనాపూర్‌లో పద్మదేవెందర్‌రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ జడ్పీహెచ్ఎస్ లో కుటుంబంతో కలిసి ఓటు వేశారు. అంతకుముందు గోమాతకు పూజ నిర్వహించారు.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×