E-Paper
Advertisement

Sankranthiki Vasthunnam : దిల్ రాజుకు మరో దెబ్బ… బాగా డబ్బులు వచ్చే మూవీపై హై కోర్టులో పిటిషన్

Sankranthiki Vasthunnam : దిల్ రాజుకు మరో దెబ్బ… బాగా డబ్బులు వచ్చే మూవీపై హై కోర్టులో పిటిషన్
Advertisement

Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ ఫైల్ అయింది. సినిమా బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొంటూ ఈ పిల్ ఫైల్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంకటేష్ సినీ కెరీర్ లో ఏ సినిమా సాధించనంతగా ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక మెత్తంగా ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటివరకూ రూ.230కోట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా హిట్ తో పలు వివాదాలు సైతం చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగగా.. తాజాగా ఏపీ హైకోర్టులో ఈ సినిమా ఆదాయంపై పిల్ ఫైల్ అయింది. సినిమా అదనపు షోస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చెయ్యాలని పిటీషనర్ పేర్కొంటూ హైకోర్టులో పిల్ వేయటం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. ఈ సినిమా హిట్ టాక్ తో పాటు వందల కోట్ల వసూళ్లు సాధించిన కొన్ని రోజులకే నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయి. ఈ విషయం ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు హై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది.

Advertisement

ALSO READ : హస్య నటుడి ఇంట్లో తీవ్ర విషాదం

విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నింటిలో ఈ సినిమా టాప్ గా నిలిచింది. హిట్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 200కోట్ల వసూళ్లు దాటేసి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.

Advertisement

ఇప్పటికీ విడుదలై పది రోజులు దాటుతున్నా థియేటర్స్ ముందు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అమెరికాలో సైతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు 2.3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది.

ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాల్లో ఎఫ్2 మూవీ అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.132 కోట్లు సాధించింది. కాగా ఇందులో వరుణ్ తేజ్ మరో హీరోగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డ్ ను సంక్రాంతికి వస్తున్నాం బ్రేక్ చేసింది. వెంకటేశ్ సోలోగా వచ్చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 230 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు సీనియర్ హీరోల్లో రూ.200కోట్ల క్లబ్ లో చేరిన హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ తో వెంకటేష్ సైతం చిరు సరసన చేరిపోయారు.

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×