Rajpal Yadav : ప్రముఖ హాస్యనటుడు రాజ్ పాల్ యాదవ్ (Rajpal Yadav) కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి నవరంగ్ యాదవ్ వృద్ధాప్య కారణంగా మరణించారు.
బాలీవుడ్ హాస్యనటుడు రాజ్ పాల్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నౌరంగ్ యాదవ్ కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఢిల్లీలోనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నవరంగ్ యాదవ్ ఈ రోజు కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం రాజ్ పాల్ యాదవ్ షూటింగ్ నిమిత్తం థాయిలాండ్ లో ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీకి బయలుదేరినట్టు సినివర్గాలు వెల్లడించాయి.
ALSO READ : ఫ్యామిలీ హీరోగా మారనున్న సిద్ధు.. ఆ దర్శకుడితో సినిమా ఫిక్స్.?