Sobhita Dhulipala: అందాల ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ్ల .. గతేడాది అక్కినేని కోడలిగా మారిన విషయం తెల్సిందే. అక్కినేని నాగచైతన్యతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఈ చిన్నది చాలా సాంప్రదాయబద్దంగా కనిపించింది. పెళ్లి అయ్యేవరకు కూడా ఆమె తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించింది. ఇక అదంతా కేవలం పెళ్లి వరకే అని ఆ తరువాత అందరికీ తెలిసిపోయింది. సంక్రాంతి పండుగ రోజు శోభితా కాలికి మెట్టెలు లేకుండా కనిపించి ట్రోల్ కు గురైంది.
మొదటి నుంచి చై పక్కన శోభితా ఉండడం నెటిజన్స్ కు నచ్చలేదు. ముఖ్యంగా సామ్ అభిమానులకు అయితే అస్సలు నచ్చలేదు. సామ్ ను రీప్లేస్ చేస్తుంది అనుకున్నా.. ఎప్పటికప్పుడు శోభితా వారిని డిజపాయింట్ చేస్తూనే వస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. పెళ్లి తరువాత శోభితా సినిమాలకు గ్యాప్ ఇస్తుందని అనుకున్నారు. అక్కినేని పెద్ద కోడలిగా బాధ్యతలు చేపట్టి కనీసం ఒక ఏడాది వరకు అయినా అమ్మడు వెండితెరపై కనిపించేదేమో అనుకున్నారు. అంతేకాదు .. అమల లానే శోభితా కూడా హెయిర్ కట్ చేయిస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు.
Actor Sai Kumar: బాలకృష్ణను గుండెల మీద తన్నితే.. వెనక్కి వెళ్లి పడ్డాడు
సమంతపెళ్లి తరువాత ఆ హెయిర్ స్టైల్ తోనే కనిపించేది. దీంతో శోభితా కూడా అలానే ఉంటుందని అనుకున్నారు. కానీ, శోభితా మాత్రం పెళ్లి వరకే సాంప్రదాయం అని చెప్పుకొచ్చేసింది. పెళ్లి తరువాత ఈ చిన్నది అందాల ఆరబోత కొద్దిగా తగ్గించిందనే చెప్పాలి. బాలీవుడ్ లో ఈ భామ చేసిన ఎక్స్ పోజింగ్.. అంతా ఇంతా కాదు. ఇంటిమేటెడ్ సీన్స్, న్యూడ్ సీన్స్.. కండోమ్ యాడ్స్ ఇలా ఒకటి అని చెప్పలేం. కానీ, పెళ్లి తరువాత శోభితా వాటికి ఫుల్ స్టాప్ పెట్టినట్లే కనిపిస్తుంది.
ఇక తాజాగా అక్కినేని కోడలు ఢిల్లీలో కనిపించి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ఉన్నప్పుడు అనే క్యాప్షన్ తో అమ్మడు ఒక సెల్ఫీ ఫోటోను అభిమానులతో షేర్ చేసింది. బ్లూ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో అద్దం ముందు నిలబడి హొయలు పోతూ కనిపించింది. ఇక ఈ డ్రెస్ లో అమ్మడి క్లివేజ్ కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే శోభితా ఢిల్లీకి ఎందుకు వెళ్లింది.. ? షూటింగ్ కోసమేనా.. ? పెళ్లి తరువాత సినిమాలు చేయడం మొదలుపెట్టిందా.. ? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే.. ఎలాంటి సినిమాలను ఎంచుకుంటుంది అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. మరి శోభితా.. అక్కినేని కోడలిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లిందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.