BigTV English
Advertisement

Allu Arjun : ‘పుష్ప 2’ రిలీజ్ కు మరో అడ్డంకి.. ఇలా అవుతుందని ఊహించలేదు..

Allu Arjun : ‘పుష్ప 2’ రిలీజ్ కు మరో అడ్డంకి.. ఇలా అవుతుందని ఊహించలేదు..

Allu Arjun : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ పుష్ప 2.. ఈ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో పుష్ప 2 ను ప్రమోట్ చేసేందుకు పలు ప్రాంతాల్లో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ఈవెంట్లలో కేవలం బన్నీ మాత్రమే మాట్లాడాడు.. డైరెక్టర్ సుకుమార్ కొన్ని పనుల వల్ల ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నాడు. ఇక కొచ్చిలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో బన్నీ సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా పుష్ప 2 ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవని ఓ వ్యక్తి అల్లు అర్జున్ పై పోలీస్ కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


అల్లు అర్జున్ పై పోలీస్ కేసు.. 

అల్లు అర్జున్ ఏ ఈవెంట్ కు వెళ్లినా అల్లు ఆర్మీ అనే పదంను వాడుతున్నాడు. బన్నీ మెగా ట్యాగ్ ను వదిలేసి అల్లు ఆర్మీని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఏ వేడుకకు హాజరైన ‘అల్లు ఆర్మీ’ అంటూ ఓ బ్యాచ్ జనంలో బ్యానర్లు ఎగరేస్తూ ఉంటారు. రీసెంట్‌గా ‘పుష్ప ది రూల్’ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం కేరళకు చెందిన కొచ్చిలో జరిగిన వేడుకలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ ప్రస్తావన తెచ్చారు. తన అభిమానులకు ఆర్మీ అనే పేరును కొచ్చి అభిమానులే సృష్టించారని ఆయన చెప్పుకొచ్చారు. అలా ఆయన ఎక్కడికి వెళ్లినా ఆర్మీ అని సంభోదిస్తున్నాడు. ఆర్మీ అన్న పదం వాడటం సరి కాదని గ్రీన్‌ పీస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్‌కు ఇబ్బందిగా మారింది. అందుకే ఆయన అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు..


ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, దీనిని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్మీ అంటే జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన అంశమని, అల్లు అర్జున్‌ మాత్రం.. ఇవేవీ పట్టించుకోకుండా పలు వేదికలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించాడని పేర్కొన్నారు. వెంటనే అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలని బైరి శ్రీనివాస్ గౌడ్‌ పోలీసులను ఆశ్రయించి డిమాండ్ చెయ్యడం చర్చనీయాంశంగా మారింది..

పోలీస్ కేసు ‘పుష్ప 2’ రిలీజ్ పై ఎఫెక్ట్ పడుతుందా..? 

ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. పాట్నా, చెన్నైయ్, కొచ్చి, ముంబై ఇలా వరుస ఈవెంట్స్‌తో క్షణం తీరిక లేకుండా టీమ్ సినిమాను ప్రమోట్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అనసూయ, సునీల్, ఫాహాద్ ఫాజిల్ వంటి స్టార్స్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ పోలీస్ కేసు పుష్ప 2 రిలీజ్ పై ఎఫెక్ట్ పడుతుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఏది ఏమైనా ఈ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×