BigTV English

Mohan babu : నిర్ణయం మార్చుకున్న పోలీసులు… మోహన్ బాబుపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..

Mohan babu : నిర్ణయం మార్చుకున్న పోలీసులు… మోహన్ బాబుపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..

Mohan babu : మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ అవుతుంది. గత నాలుగు రోజులుగా తెలుగు ప్రజలను అశ్చర్యపరుస్తూ మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు బయటపడుతున్నాయి.. తన తండ్రి వల్ల తనకు, తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని మంచు మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ కేసును పరిగణలోకి తీసుకున్న పోలీసులకు మోహన్ బాబు తన కొడుకు వల్ల ప్రాణ హాని ఉందని కేసు పెట్టారు. ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు ఇద్దరికీ సర్ది చెప్పాలని చూసిన వినలేదు. జల్లిపల్లిలో మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలను కవరేజ్ చెయ్యడానికి వచ్చిన మీడియా పై మోహన్ బాబు విరుచుకుపడ్డాడు. మీడియా ప్రతి నిధుల పై దాడి చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు వ్యవహరించిన తీరును మీడియా ప్రతినిధులు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి..


మోహన్ బాబు తీరు పై మీడియా అసహనం.. 

ఒక మీడియా ప్రతినిధిని విచక్షణ రహితంగా కొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనకు మూడో చోట్ల ఫ్యాక్చర్ అయ్యిందని వైద్యుల రిపోర్ట్ లో రావడంతో మీడియా ప్రతినిధులతో పాటుగా జర్నలిస్ట్ సంఘాలు కూడా మోహన్ బాబుకు వ్యతిరేకంగా బుధవారం నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుటు ఆందోళనకు కూడా దిగారు. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మంగళవారం మంచు ఫ్యామిలీ వివాదాన్ని కవర్ చేస్తున్న మీడియాపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధుల మైకులు లాక్కొని కోపంతో నేలకేసి కొట్టారు. మీడియా ప్రతినిధులు గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు మోహన్ బాబును అదుపుచేశారు. మీడియాపై మోహన్ బాబు బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. ఈ క్రమంలో మోహన్ బాబు పై పోలీస్ కేసు నమోదైంది.


మోహన్ బాబుకు షాకిచ్చిన పోలీసులు..?

జల్లిపల్లి లో మంచు ఫ్యామిలీ గొడవల పై కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టుపై అమానుషంగా దాడికి పాల్పడిన మోహన్ బాబు పై పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. జర్నలిస్టుపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. బుధవారం మోహన్ బాబుపై 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్‌ను మార్చారు.. ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ తీసుకుని తాజాగా ఆయనపై BNS 109 సెక్షన్ కింద హత్యాయత్న కేసు నమోదు చేశారు.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న మోహన్ బాబును వైద్య పరీక్షల అనంతరం అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం మోహన్ బాబు అరెస్ట్ పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. అరెస్ట్ తర్వాత ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.. తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ గొడవల పై చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఫిలిం ఛాంబర్ లో కూడా ఈ గొడవల గురించి పెద్దలు చర్చిస్తున్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×