BigTV English

Pushpa2 : ‘పుష్ప 2’ డిలీటెడ్ డైలాగ్.. ఇది ఉండింటే థియేటర్లు బద్దలయ్యేవే..

Pushpa2 : ‘పుష్ప 2’ డిలీటెడ్ డైలాగ్.. ఇది ఉండింటే థియేటర్లు బద్దలయ్యేవే..

Pushpa2 : పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ 15 రోజులు అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1600 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.. అతి త్వరలోనే బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలతో పాటుగా భారీ డైలాగులు కూడా ఉన్న సంగతి తెలిసిందే.. అయితే సినిమా లెన్త్ ఎక్కువ అవ్వడంతో కొన్ని సీన్లు లేపేశారని వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అందులో పొన్నప్ప చెప్పిన ఒక డైలాగును మేకర్స్ డిలీట్ చేశారు. ఆ సీన్ ఉనింటే థియేటర్లు దద్దరీల్లేవి అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ డైలాగును పొన్నప్ప చెప్పాడు. శ్రీవల్లి కోసం వచ్చే ఫైటింగ్ సమయంలో ఆ డైలాగు వస్తుందట.. దాన్ని ఎందుకు డిలీట్ చేసారో తెలుసుకుందాం..


అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 మూవీ అంతా ఒక ఎత్తు.. కానీ ఈ మూవీలో 21 నిముషాల పాటు ఉండే జాతర సీన్ థియేటర్లలో చూసే ప్రతిఒక్కరికి పునాకాలు తెప్పిస్తుంది. ఆ సీన్‌లో అమ్మవారి వేషధారణలో అల్లు అర్జున్ లుక్, ఆ ఆహార్యం, ఎక్స్‌ప్రెషన్స్, సాంగ్, డ్యాన్స్, చుట్టూ జాతర వాతావరణం.. అబ్బబ్బా చెప్తే అర్థమయ్యే సీన్ కాదది. ఇక ఆ సాంగ్ అయిపోయిన తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా సినిమాను మరో స్థాయిలో నిల్చోబెట్టింది. ఇక ఆ సీన్‌లో ఎంట్రీ ఇచ్చే విలన్ బుగ్గారెడ్డి పాత్ర లో తారక్ పొన్నప్ప నటించాడు. సుకుమార్ లెక్కకు సరిపోయేలా కరెక్ట్ గా ఉన్నారు. అతని పెర్ఫార్మన్స్ ఏ రేంజులో ఉందో చెప్పాలంటే సినిమాను తప్పక చూడాలి.. ఆ పాత్రకు కరెక్ట్ గా ఆయన సరిపోయాడు.

సినిమాలో పొన్నప్ప కళ్లలోనే విలనిజం, ఆ సైకోయిజం అన్నీ కనిపిస్తాయి. అక్కడ ఫైట్ సీన్ అయిపోయాక మళ్లీ క్లైమాక్స్‌లోనే ఈ బుగ్గారెడ్డి పాత్ర కనిపిస్తుంది. అక్కడ కూడా ఉన్నది కాసేపే అయినా ప్రేక్షకులకి ఆ హై, గూస్‌బంప్స్ తెప్పించే రప్పారప్పా ఫైట్ సీన్‌లో బుగ్గారెడ్డి పాత్ర కూడా కీలకం. ఈ పాత్ర చేసిన తారక్ పొన్నప్ప ఇటీవల దేవర చిత్రంలో కూడా కీలకపాత్ర చేశాడు.. పుష్ప 2 ల్ ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2లో తన పాత్రకి సంబంధించిన ఓ డైలాగ్‌ని ఎడిటింగ్‌లో లేపేశారని చెప్పాడు. ఆ మూవీ జాతర సీన్ అయ్యాక పుష్ప.. ఆ పొద్దు నువ్వు జాతరలో కొట్టినప్పుడు నాకేం అనిపిచ్చలే.. ఏదో అన్నతమ్ముడి కొట్లాట అని వదిలేసినా.. కానీ ఈ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావ్ చూడు.. అప్పుడు తగిలినాది నువ్వు కొట్టిన ప్రతీ దెబ్బ.. ఏందీ ఆ అమ్మి మీద చిన్న గీటు పడితే రప్పారప్పా అని నరుకుతావా..అంటూ డిలీటెడ్ డైలాగ్‌ని చెప్పాడు తారక్.. ఆ డైలాగులో ఎంత ఫైర్ ఉంది. మరి అలాంటి సీన్ ను ఎందుకు డిలీట్ చేశారు. ఇది కనుక సినిమాలో ఉనింటే బాక్సాఫీస్ రికార్డులు వేరే లెవల్ ఉండేవని చెబుతున్నారు. తారక్ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఈ నిజం బయట పడింది.. ఇక ఆ డైలాగును పుష్ప 3 లో ఏమైన యాడ్ చేస్తారేమో చూడాలి.. ఇక ఈ మూవీ రెండు వారాలకు గాను ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత వేగంగా భారీ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×