Diabetic Patients: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు ఇతర అలవాట్లు మాధుమేహం రావడానికి కారణం అవుతున్నాయి. 2022 లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 83 కోట్ల మందికి పైగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే 183 దేశాల్లో 90 శాతం కంటే ఎక్కువ మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఇది అనేక విధాలుగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సకాలంలో మధుమేహంపై శ్రద్ధ చూపకపోతే అది కళ్లు, మూత్ర పిండాలు, నరాలపై ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉంటే కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.
మధుమేహం రోగులలో ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తెలుసుకోవడానికి ఇటీవల ఓ అధ్యయనంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు కాలక్రమేణా కొన్ని రకాల పోషకాల లోపంతో ఉంటారని ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన ఈ అధ్యయనం డయాబెటిక్ రోగులలో విటమిన్ డి లోపం, చాలా సాధారణం అని అంచనా వేసింది. అంతే కాకుండా తర్వాత మెగ్నీషియం లోపం కూడా ఉంటుంది. ఈ రెండు పోషకాలు ఆరోగ్యానికి అవసరం అయినవే.
బ్రిటీష్ మెడికల్ జర్నల్ న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్‌లో ప్రచురించిన ప్రపంచ విశ్లేషణ షుగర్ పేషెంట్లలో రెండు ముఖ్యమైన పోషకాహారాల గురించి వివరించింది. మధుమేహంతో బాధపడుతున్న వారిలో 60 శాతం మందికి పైగా విటమిన్ డి లోపం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మధుమేహంతో బాధపడుతున్న వారిలో 42 శాతం మందిలో మెగ్నీషియం ఉన్నట్లు వెల్లడైంది. మెగ్నీషియం కండరాలు, ఎముకలను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో కనిపించే విటమిన్ డి , మెగ్నీషియం లోపం వల్ల దాని ఆరోగ్యానికి ముప్పు తెలుస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది
అధ్యయనంలో ఏమి కనుగొన్నారు ?
1998 , 2023 మధ్య 52,000 కంటే ఎక్కువ మంది పాల్గొనే 132 అధ్యయనాలు విశ్లేషించబడ్డాయి. ఇందులో, డయాబెటిక్ రోగులలో సంభవించే పోషకాల లోపంపై సకాలంలో దృష్టి పెట్టడంపై దృష్టి పెట్టబడింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ (IIHMR) పరిశోధకులు మధుమేహ సమస్యలను తగ్గించడానికి రోగులలో సూక్ష్మపోషకాల లోపాలను పరిష్కరించాలని సూచించారు. మధుమేహం ఉన్నవారిలో 28 శాతం మంది కూడా ఐరన్ లోపంతో బాధపడుతున్నారని తెలిపారు.
పురుషుల కంటే మధుమేహం ఉన్న మహిళలకు సూక్ష్మపోషకాల లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందని, ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బృందం కనుగొంది. డయాబెటిక్ పేషెంట్లలో కనిపించే విటమిన్ డి మరియు మెగ్నీషియం లోపం వల్ల దాని ఆరోగ్యానికి ముప్పు తెలుస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది
మధుమేహం, దాని వల్ల కలిగే అనేక సమస్యలను తగ్గించడంలో సూక్ష్మపోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గ్లూకోజ్ జీవక్రియ , ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి 12 లోపం ప్రపంచవ్యాప్తంగా 29 శాతం మధుమేహ రోగులను కూడా ప్రభావితం చేస్తుందని మరియు డయాబెటిస్ డ్రగ్ మెట్‌ఫార్మిన్ తీసుకునే వారిలో ఇది మరింత ఎక్కువగా ఉందని విశ్లేషణ కనుగొంది.
రిస్క్‌లను అర్థం చేసుకుని, డయాబెటిక్ రోగులందరూ తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరిశోధకులు చెబుతున్నారు. అవసరమైతే, వైద్య సలహాపై సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఈ పోషకాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది.
Also Read: ఫూల్ మఖానా తింటున్నారా ? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
పోషకాల వల్ల వచ్చే సమస్యలు:
మధుమేహం సమస్య ఎముకలను బోలుగా మారుస్తుందని, అలాంటి పరిస్థితుల్లో విటమిన్ డి లోపం వల్ల భవిష్యత్తులో ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలిపారు. విటమిన్ డి లోపం శరీరంలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది.
అదేవిధంగా, మెగ్నీషియం లోపం టైప్ -2 డయాబెటిస్‌కు కారణం కావచ్చు. ఇది డయాబెటిస్ లక్షణాలను పెంచే సమస్య కూడా. మెగ్నీషియం లోపం అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి , మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.